ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే నెల రోజుల్లో మీ జుట్టు డబుల్ అవుతుంది!

ఇటీవల రోజుల్లో దాదాపు అందరూ హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem )ను కామన్ గా ఎదుర్కొంటున్నారు.అయితే ఇలా జుట్టు ఊడి ఊడి చాలా పల్చగా మారిపోతుంటుంది.

 Follow This Simple Tip And Your Hair Will Double In A Month!, Hair Growth Spray,-TeluguStop.com

ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జుట్టు మళ్ళీ ఒత్తుగా మారదు.మీరు కూడా పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయారా.? అయితే అస్సలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే నెల రోజుల్లో మీ జుట్టు డబుల్ అవుతుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Fall, Spray, Thick, Thin-Telugu Health

ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అల్లం ముక్కను పొట్టు తొలగించి మెత్తగా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దంచిన అల్లం ముక్క, గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు వేసి ప‌దిహేను నిమిషాల పాటు బాగా ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆముదం, నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea Tree Essential Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న వాటర్ ను నింపుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Spray, Thick, Thin-Telugu Health

స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఈ వాటర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట ఆనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ గ్రోత్ అనేది అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.అదే సమయంలో జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.కొద్ది రోజుల్లోనే పల్చగా ఉన్న మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.కాబట్టి పల్చటి జుట్టుతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.

కురులను ఒత్తుగా మార్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube