ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే నెల రోజుల్లో మీ జుట్టు డబుల్ అవుతుంది!
TeluguStop.com
ఇటీవల రోజుల్లో దాదాపు అందరూ హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem )ను కామన్ గా ఎదుర్కొంటున్నారు.
అయితే ఇలా జుట్టు ఊడి ఊడి చాలా పల్చగా మారిపోతుంటుంది.ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జుట్టు మళ్ళీ ఒత్తుగా మారదు.
మీరు కూడా పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయారా.? అయితే అస్సలు చింతించకండి.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే నెల రోజుల్లో మీ జుట్టు డబుల్ అవుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక అల్లం ముక్కను పొట్టు తొలగించి మెత్తగా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దంచిన అల్లం ముక్క, గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు వేసి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆముదం, నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea Tree Essential Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న వాటర్ ను నింపుకోవాలి.
"""/" /
స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఈ వాటర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
గంట ఆనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ గ్రోత్ అనేది అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
అదే సమయంలో జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.కొద్ది రోజుల్లోనే పల్చగా ఉన్న మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.
కాబట్టి పల్చటి జుట్టుతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.