ఓ టెన్షన్ తీరింది.. టూర్లు చెక్కేస్తున్న నాయకులు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ( General Election Polling )ప్రక్రియ ముగియడంతో, ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నాయకులంతా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు .ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ వరకు వెలువడే అవకాశం లేకపోవడంతో,  అప్పటి వరకు కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనేక ప్రాంతాలకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వెళ్తున్నారు.

 The Tension Is Over.. Leaders Carving Tours, Ap Government ,ap Elections, Tdp,-TeluguStop.com

కొంతమంది విదేశాలకు వెళుతుండగా,  మరి కొంతమంది నేతలు హైదరాబాద్,  కొడైకెనాల్,  ఊటీ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తూ కుటుంబ సభ్యులతో రిలాక్స్ అవుతున్నారు.

పోలింగ్ ముగిసిన తరువాత కూడా తమ ఇళ్ళ వద్ద కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉండడం, ఖర్చు కూడా తడిసి మోపుడు అవుతుండడంతో , వీటిని తట్టుకోలేక చాలామంది సొంత నియోజకవర్గాలను వదిలిపెట్టి విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Ap, Chandrababu, Cm Ys Jagan, Jagan, Janasena, Pawan Kalyan, Ysrcp-Politi

  వైసిపి అధినేత జగన్( CM YS jagan ) సైతం కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్తున్నారు.ఇప్పటి వరకు ఎన్నికల తతంగం లో బిజీబిజీగా నాయకులు గడిపారు.  ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చాలా నెలలుగా టెన్షన్ వాతావరణంలోనే ఉన్నారు.

Telugu Ap, Chandrababu, Cm Ys Jagan, Jagan, Janasena, Pawan Kalyan, Ysrcp-Politi

మళ్ళీ టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్ ఒకవైపు , టికెట్ ఖరారైన బి ఫారం చేతికి అందే వరకు మరో టెన్షన్ నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా పూర్తవుతుందా లేదా అనే టెన్షన్,  టికెట్ వచ్చిన తర్వాత పార్టీలోని అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవడం, నియోజకవర్గ ప్రజలు తమ బలం పెంచుకునేందుకు రకరకాల మార్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఎన్నికల ప్రచారానికి జన సమీకరణ చేపట్టడం , ఎన్నికల్లో డబ్బుల పంపిణీ వ్యవహారాలు ఎలా ఎన్నో తలనొప్పులతో బిజీ బిజీగా గడిపిన అభ్యర్థులంతా విహార యాత్రలకు వెళ్తూ సేద తీరుతున్నారు.ఏపీవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గంలోని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా విహార యాత్రల ప్లాన్ లోనే ఉన్నారట

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube