కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ లు విడాకులు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట దాదాపు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు.
కానీ ఈ జంట వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.తర్వాత ఎవరికి వారు కెరియర్ పరంగా ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
అయితే ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.ఆ విషయం గురించి ఈ ఇద్దరూ స్పందించలేదు.
ఇదిలా ఉంటే తమిళ రేడియో జాకీ, గాయని సుచిత్ర కార్తీక్( Suchitra ) ఇప్పుడు పెద్ద బాంబు పేల్చింది.

మరో స్త్రీతో ధనుష్( Dhanush ) సంబంధం పెట్టుకున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.సుచిత్ర గురించి మనందరికీ తెలిసిందే.అప్పట్లో సుచీలీక్స్ పెద్ద సంచలనం అనే చెప్పాలి.2017లో, తమిళ రేడియో జాకీ గాయని సుచిత్రా కార్తీక్ తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యిందని తెలిపింది.అలాగే ధనుష్ అసిస్టెంట్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది.
తమిళ సినిమాలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తూ ధనుష్ అసిస్టెంట్ తనకు డ్రగ్స్ ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడని సుచిత్ర ఆరోపించడం సంచలనంగా మారింది.

ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అలాగే ఆండ్రియా జెరెమియా, త్రిషకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె ట్విట్టర్ ఖాతాలో కనిపించాయి.కాగా తాజాగా సుచిత్ర ఒక ఇంటర్వ్యూలో ధనుష్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.ధనుష్, ఐశ్వర్యల విడాకులు గురించి మాట్లాడింది సుచిత్ర.
ధనుష్ ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారు.నాకు ధనుష్ మీద కోపం వచ్చింది.
నేను దానిని మరొక విధంగా చూస్తాను.రీల్స్ చేసే తల్లులంటే నాకు ఇష్టం ఉండదు.
ధనుష్ మంచి తండ్రి, ఐశ్వర్య మంచి తల్లి కాదు అని సుచిత్ర చెప్పుకొచ్చింది.పెళ్లయ్యాక ఎవరైనా డేట్‌కి వెళ్తారా.? కానీ ధనుష్ ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు.ధనుష్ ఐశ్వర్యను మోసం చేశాడు.
ధనుష్ స్వలింగ సంపర్కుడని అలాగే డ్రగ్స్ వాడేవాడని ఆమె ఆరోపించింది.దాంతో ధనుష్, రజినీకాంత్ ఫ్యాన్స్ సుచిత్ర పై కామెంట్స్ చేస్తున్నారు.
ఆమెను ట్రోల్ చేస్తున్నారు.ఆమె మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో సుచిత్ర భర్త కూడా ఆమె మానసిక స్థితి బాలేదు అని చెప్పాడు.ఇప్పుడు ఈ కామెంట్స్ ఎలాంటి చర్చకు దారితీస్తాయో చూడాలి మరి.