బైక్ రైడ్ చేస్తూ ఆశ్చర్యపరిచిన ఎలుగుబంటి.. రష్యాలో అంతే..?

సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యమేస్తుంది.వీటిని చూసి మన కళ్లను మనమే నమ్మలేము.

 A Bear Surprised While Riding A Bike.. That's All In Russia, Russia, Viral News,-TeluguStop.com

చూస్తున్నది నిజమేనా అని అనిపిస్తుంది కూడా.అలాంటి ఒక అద్భుతమైన దృశ్యంతో ఆశ్చర్యపరిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో 25 పౌండ్ల బరువున్న ఓ ఎలుగుబంటి ఒక మోటార్‌సైకిల్ సైడ్‌కార్‌లో కూర్చొని ప్రయాణిస్తుంది.చాలా ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుత జనరేషన్ నెటిజన్లు దీన్ని చూసి షాక్ అవుతున్నారు.

ఈ వీడియో రష్యా( Russia)లోని సిక్తివ్‌కార్ నగర వీధుల్లో రికార్డ్ చేశారు.ఈ ఎలుగుబంటి పేరు టిమ్‌.ఇది ఒక సర్కస్ ట్రైనర్ తో పాటు, పోలార్ వోల్వ్స్ క్లబ్‌కు చెందిన ఒక బైకర్ తో కలిసి సైడ్‌కార్‌లో ప్రయాణిస్తుంది.

మోటార్‌సైకిల్ వెళుతున్నప్పుడు, టిమ్‌ చాలా హాయిగా కూర్చొని, రోడ్డు పక్కన ఉన్న వారికి చేయి ఊపుతూ ఉంటుంది.రష్యాలో ఇలాంటి దృశ్యాలు కొత్తేం కాదు, అయితే ఈ ఎలుగుబంటి ప్రవర్తన చాలా ఆసక్తికరంగా, ఫన్నీగా అనిపించింది.

టిమ్‌( Tim ) ఒక సాధారణ ఎలుగుబంటి కాదు, ఇది పోలార్ వోల్వ్స్ బైక్ క్లబ్ ట్రావెల్ సర్కస్‌తో పని చేస్తుంది.ఇది చాలా ట్రైన్డ్‌ బేర్ అని చెప్పవచ్చు.ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లు విభిన్న రకాల స్పందనలను పొందుతోంది.కొంతమంది వ్యూయర్స్‌ ఈ ఎలుగుబంటి ఒక హెవీ మీల్ తర్వాత కొంత తాజా గాలి పీల్చుకోవాలని ఇలా బైక్‌ ఎక్కినట్లు ఉంది అని చమత్కారంగా వ్యాఖ్యానించారు, ఒక యూజర్ కామెంట్ “రష్యన్ ఉబెర్ డ్రైవర్లు చాలా బహుముఖులు” అని హిలేరియస్ జోక్ చేశారు.

ఈ వీడియోకు 1 కోటి 54 లక్షల వ్యూస్ వచ్చాయి.లక్షల పైగా లైక్స్ వచ్చాయి.సాధారణంగా రష్యాలో ఎలుగుబంట్లు చాలా చోట్ల కనిపిస్తాయి.ఇవి ప్రజలకు హాని చేయకుండా వారితో అప్పుడప్పుడు ఫ్రెండ్లీగా ప్రవర్తిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube