ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రియేటివ్ పార్క్స్ ఎన్నో ఉన్నాయని సంగతి తెలిసిందే.చాలా వినూత్నంగా ఆలోచించే ఈ పార్కులను ఏర్పాటు చేస్తారు.
వీటిలోకి వెళ్తే మనకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.అయితే, వియత్నాంలో ఒక పార్క్ మాత్రం చాలా ప్రత్యేకంగా, వింతగా నిలుస్తోంది.
ఎందుకంటే ఇది ప్రపంచాన్నే కుదిపేసిన మహమ్మారి కోవిడ్-19 థీమ్‌తో నిర్మించబడింది.ఈ ప్రత్యేకమైన ఉద్యానవనానికి “కోవిడ్-19 పార్క్” ( Covid-19 Park )అని వెరైటీగా పేరు పెట్టారు.
ఇది వియత్నాం దేశంలోని తుయెన్ లామ్ లేక్ నేషనల్ టూరిస్ట్ కాంప్లెక్స్‌లో( Tuen Lam Lake National Tourist Complex ) ఒక భాగం.
ఎల్లా రిబాక్ ( Ella Reebok )అనే 29 ఏళ్ల బ్రిటిష్ యువతి ఈ పార్కుకు సంబంధించిన ఒక వీడియోను తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది.
షేర్ చేసిన కొంత సమయంలోనే అది వైరల్ అయింది.లండన్‌కు( London ) చెందిన ఎల్లా తన పోస్ట్‌లో “ఈ వైరస్ ఇంకా ఉందో లేదో ఎవరికైనా తెలుసా? నాకు వియత్నాం అంటే చాలా ఇష్టం.కోవిడ్-19కి అంకితం చేసిన ఒక థీమ్ పార్క్‌ను ఇంత గొప్పగా ఎవరు సృష్టిస్తారు?” అని రాసింది.ఓ ఇంటర్వ్యూలో, ఎల్లా తన అనుభవాన్ని వింతగా, నవ్వు తెప్పించేలాగా వర్ణించింది.“ఇది చాలా విచిత్రమైన అనుభవం.నేను, నాతోటి ప్రయాణికులు నవ్వాపుకోలేకపోయాం.
అక్కడి స్థానికులు కూడా నవ్వుతున్నారా అని చూస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళు చాలా సీరియస్‌గా ఉన్నట్లు కనిపించారు,” అని ఆమె చెప్పింది.
పార్కు ప్రవేశద్వారం వద్ద ఒక గడియారం ఉందని, అది ఆ ప్రదేశానికి డిస్టోపియన్ వైబ్ తీసుకొచ్చిందని ఆమె పేర్కొంది.ఆ గడియారంలో కరోనా వైరస్ ఎప్పుడు మొదలైంది వంటి వివరాలను రాసినట్లుగా పేర్కొంది.ఆమె పార్కును మరింత ఎక్స్‌ప్లోర్ చేయగా కొన్ని మట్టి శిల్పాలు హాస్యంగా కనిపించాయి.
ఉదాహరణకు, ఒక శిల్పంలో పెద్ద రోగకారక క్రిమి కళ్లు తేలేస్తూ జైలు గదిలో బంధించబడి ఉంది.
పార్కు సందేశం ఎంతవరకు సీరియస్‌గా ఉందో చెప్పడం కష్టమని ఎల్లా అంగీకరించింది.“చాలా మందికి ఇది సున్నితమైన అంశం, కానీ మట్టి శిల్పాలు చాలా ఫన్నీగా ఉండటంతో దాన్ని సీరియస్‌గా తీసుకోవడం కష్టంగా ఉంది.చివరికి, పార్కు నిజమైన ఉద్దేశం మాకు అర్థం కాకపోయినా, మేం చాలా ఆనందించాము.” అని ఆమె తెలిపింది.ఈ వింతైన పార్కు వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ఇలాంటి పార్కులు కూడా క్రియేట్ చేస్తారా అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు.