మన పెద్దలు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని అన్నారు.అన్నాన్ని మనం దైవ సమానంగా భావిస్తే అన్నాన్ని వృధా చేయకుండా ఉంటామని మన పెద్దలు ఆలా చెప్పారు.
అన్నాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.అలాగే భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను అసలు చేయకూడదు.
అలాగే తప్పనిసరిగా కొన్ని నియమాలను
పాటిస్తే మన మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటుంది.ఇప్పుడు వాటి గురించి
వివరంగా తెలుసుకుందాం.
భోజనం చేసిన తర్వాత చేతిని కంచంలో కడగకూడదు.ఆలా కడిగితే దరిద్రం
చుట్టుకుట్టుందట.కాబట్టి భోజనం అయ్యాక బయటకు వెళ్లి చేతిని కడుక్కోవాలి.
భోజనం చేసేటప్పుడు పొలమారినా, దగ్గినా ఆ ప్రదేశంలో ఉమ్మివేయడం చేయరాదు.
ఇది పరమ దరిద్రానికి హేతువు.
భోజనం చేసిన తర్వాత పళ్ళ సందుల్లో దూరిన ఆహార అవశేషాలను తొలగించటానికి టూత్ పిక్ లను ఉపయోగిస్తూ ఉంటారు.
ఆలా చేయకూడదు.నోటిలో నీటిని పోసుకొని పుక్కిలించాలి.
టూత్ పిక్ ను ఉపయోగించటం దరిద్రానికి దారితీస్తుంది.
భోజనం చేసిన వెంటనే చాలా మంది పడుకుంటారు.
ఆలా చేయకూడదు.ఇది దరిద్రానికి
కారణమవుతుంది.
భోజనం అయ్యాక చేతిని కడుక్కొని వస్త్రంతో తుడుచుకోకుండా చేతిని విదిలిస్తారు.ఆలా చేయటం వలన చేతిపై ఉన్న నీరు చుట్టూ ఉన్నవారిపై, ఆహార పదార్థాలపై పడుతుంది.కాబట్టి చేతులు కడుక్కున్న తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి.ఇలా విదిలించడం చాలా దరిద్రం.