కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, ప్రజలు రైళ్లతో సహా ప్రజా రవాణా వాహనాలపైన కూర్చొని ట్రావెల్ చేయడం సాధారణంగా కనిపించే దృశ్యమే.ముఖ్యంగా తరచూ ఆగే లోకల్ రైళ్లలో ఇలా ఎక్కువగా జరుగుతుంది.
బంగ్లాదేశ్ ( Bangladesh )వంటి ఇతర దేశాలలో కూడా ఇలాంటి పద్ధతులు కనిపిస్తాయి, అక్కడ ప్రజలు తరచుగా భయం లేకుండా రైలు పైకప్పులపై ప్రయాణిస్తుంటారు.కానీ ట్రైన్ పై కప్పు పై ట్రావెల్ చేయడం ప్రాణంతో చలగాటం ఆడిన దానితో సమానం.
ఇక ఇంజన్ పై కప్పుపై పడుకొని ప్రయాణిస్తూ కెమెరాకి పోజులు ఇవ్వడం మరింత రిస్క్ తో కూడుకున్న పని.
అయితే ఇటీవల, రాహుల్ గుప్తా( Rahul Gupta ) అనే భారతీయ యువకుడు బంగ్లాదేశ్‌ను సందర్శిస్తున్నప్పుడు ఈ ప్రమాదకరమైన విన్యాసాన్ని ప్రయత్నించాడు.రాహుల్ ఒక కంటెంట్ క్రియేటర్.15,000 మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో పాపులర్ అయ్యాడు.అతను తరచుగా రైలు సంబంధిత కంటెంట్‌ను పంచుకుంటాడు.ఈ యాత్రలో, అతను కదులుతున్న రైలు పైకి ఎక్కి తన అనుభవాన్ని వీడియోలో రికార్డ్ చేశాడు.ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా, అతను ప్రమాదాలను లెక్కచేయకుండా రైలు పైకప్పుపై పడుకుని వీడియో చేశాడు.
వైరల్ వీడియోలో, రాహుల్ రైలు ఇంజిన్ పైకప్పుపై విశ్రాంతి తీసుకుంటూ రిలాక్స్‌గా ఉన్నట్లు కనిపిస్తాడు.అతను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో కూడా చిత్రీకరిస్తున్నాడు.ఒకానొక సమయంలో, అతను కెమెరాకు చేయి ఊపుతూ “నేను బంగ్లాదేశ్‌లోని రైలు పైకప్పుపై ఉన్నాను” అని చెబుతాడు.
ఆ తరువాత వ్యూయర్స్‌ని హెచ్చరిస్తూ “దీన్ని ప్రయత్నించవద్దు.ఇది చాలా ప్రమాదకరం” అని అంటాడు.
ఈ వీడియోకు 1 కోటికి పైగా వ్యూస్ వచ్చాయి దీనిపై వేలాదిమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కొందరు నెటిజన్లు అతని స్టంట్ గురించి జోకులు వేశారు.“తరువాత విమానం పై కప్పు ఎక్కి వీడియో చెయ్ భయ్యా” అని ఒకరు సరదాగా రిక్వెస్ట్ చేశారు.మరొకరు “యమరాజు (మృత్యుదేవుడు) ఈరోజు సెలవులో ఉన్నట్టున్నాడు.” అని అన్నారు.మరికొందరు అతనికి రైలు లోపల సీటు దొరకలేదని వ్యాఖ్యానించారు.
ఈ వీడియో ఫన్నీగా అనిపించినా ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తన కారణంగా అతడి ప్రాణాలు పోయే రిస్క్ ఉంది.కదులుతున్న రైలుపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం, తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని గుర్తుపెట్టుకోవాలి.