వీడియో: డబ్బాలో తల ఇరుక్కుని హిమాలయన్ ఎలుగుబంటి విలవిల.. రక్షించిన ఇండియన్ ఆర్మీ..

ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లు ( Indian Army Officers )కష్టాలు, ప్రమాదాల్లో ఉన్న మనుషులను కాపాడడానికి ఎప్పుడూ ముందుంటారు.మనుషులను మాత్రమే కాదు వారు మూగ జంతువులను కూడా కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు.

 Video Indian Army Rescues A Himalayan Bear With Its Head Stuck In A Can, Indian-TeluguStop.com

తాజాగా మన భారత సైనికులు ఒక హిమాలయన్ బ్రౌన్ బేర్ పిల్లను రక్షించారు.ఆ ఎలుగుబంటి తల ఒక టిన్ డబ్బాలో ఇరుక్కుపోయింది.

సైనికులు ఆందోళన చెందిన ఎలుగుబంటికి హాని కలిగించకుండా చాలా జాగ్రత్తగా డబ్బాను తొలగించారు.దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

రెస్క్యూ ఎక్కడ జరిగిందో కచ్చితంగా వెల్లడించలేదు.కానీ, సైనికులు కఠినమైన, మంచుతో కప్పబడిన ప్రాంతంలో ఉన్నట్లుగా వీడియోలో కనిపించింది.

సైనికులు ఎలుగుబంటి( bear ) విలవిలలాడటం చూసి చెల్లించి పోయారు.ఆ ఎలుగుబంటిని శాంతపరచడానికి, డబ్బాను సురక్షితంగా తొలగించడానికి వెంటనే ఒక ప్రణాళికను రూపొందించారు.

వీడియోలో సైనికులు ఎలుగుబంటి పిల్లను మరింత భయపెట్టకుండా చాలా జాగ్రత్తగా సమీపిస్తారు.దగ్గరకు వెళ్ళిన తరువాత, వారు పరిస్థితిని అంచనా వేసి, చేతులతో డబ్బాను తొలగించడానికి ప్రయత్నించారు.

ఆ తరువాత బృందం తాడు కట్టి దాన్ని ఒక షెడ్డు లాంటి ప్రదేశానికి తరలించి, దాని మెడ చుట్టూ ఉన్న డబ్బాను వదులు చేయడానికి ఒక నిప్పర్( Nipper ) (కొలిమి కత్తి) ఉపయోగించింది.

ఎలుగుబంటిని విడిపించిన తరువాత, సైనికులు కోలుకోవడానికి దానికి ఆహారం ఇచ్చారు.వీడియోలో ఎలుగుబంటి మొదట పరిగెత్తడానికి ప్రయత్నించడం చూడవచ్చు దానిని తాడు కట్టి కంట్రోల్ చేశారు.ఆపై ఫుడ్ పెట్టారు.‘బహదూర్’( Bahadur ) అని పేరు పెట్టిన ఆ ఎలుగుబంటి, సైనికులను చూసి భయపడలేదు.అది అడవిలోకి తిరిగి వెళ్ళే ముందు చాలా గంటల పాటు వారితోనే ఉండిపోయింది.

నవంబర్ 24న షేర్ చేసిన ఈ హార్ట్ టచింగ్ వీడియోను 1,70,000 మందికి పైగా చూశారు.చాలా మంది ఈ పరిస్థితిని నిర్వహించడంలో భారత సైన్యం చూపించిన దయ, తెలివితేటలను ప్రశంసించారు.ఒక యూజర్ “ధన్యవాదాలు, భారత సైన్యం.జంతువులకు హాని కలిగించే ఇలాంటి చెత్తను ఆపడానికి మనం మార్గాలను కనుగొనగలిగితే ఎంత బాగుంటుందో.” అని అన్నారు.మరొకరు “చాలా మంచి ప్రయత్నం, ధన్యవాదాలు!” అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube