తాడిపత్రి ఘర్షణలపై రెండు కేసులు నమోదు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో( Tadipatri ) చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.దాడిలో గాయపడిన సీఐ మురళీకృష్ణ( CI Murali Krishna ) ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

 Two Cases Have Been Registered On Tadipatri Clashes Details, Anantapur District,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై( MLA Kethireddy Peddareddy ) హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

అదేవిధంగా వైసీపీ నేత రవితేజా రెడ్డి( Raviteja Reddy ) ఫిర్యాదు మేరకు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదైందని తెలుస్తోంది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.అదేవిధంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు పోలీసుల వలయంలో ఉన్నాయి.

ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube