ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది చిన్న పిల్లలు వివిధ రకాలుగా కూర్చుంటూ ఉంటారు.చిన్న పిల్లలు కూర్చునే విధానం బట్టి వారి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
చిన్న పిల్లలు( little children ) ఏం చేసినా చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటారు.వాళ్ళు తెలిసి తెలియని తనంలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.
వారిని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.చిన్న పిల్లలు చేసేది ముద్దుగానే ఉంటుంది.
కానీ కొన్నిసార్లు అదే అనారోగ్య సమస్యలకు దారీ తీస్తుంది.కాబట్టి ఇది తప్పు అంటూ వారికి చెబుతూ ఉండాలి.
పిల్లలు కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటారు.ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూర్చుంటూ ఉంటారు.
వీరిలో కొంత మంది పెద్దలు కూర్చోబెట్టినట్లు కూర్చుంటారు.

చాలా మంది పిల్లలు w ఆకారంలో కూర్చొని ఉంటారు.కానీ ఇలా కూర్చోవడం వల్ల పిల్లలు అనారోగ్య సమస్యలకు( health problems ) గురవుతున్నారు అన్న విషయం చాలా మందికి తెలియదు.ఇది మనకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది.
పిల్లలకు ఎలా పడితే అలా కూర్చోవడానికి, నడవడానికి కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.కానీ పెద్దలకు అలా ఉండదు.
నిజానికి పిల్లలు ఇలా w ఆకారంలో( w shaped ) కూర్చోకూడదు.అలా చిన్నపిల్లలు కూర్చుంటే కూర్చోవద్దని చెబుతూ ఉండాలి.
చాలా మంది పిల్లలు ఇలా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు.ఇది అసలు మంచిది కాదు.
ఇలా కూర్చుంటే వారి శరీర ఆకృతి మారడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

మరి ఆ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఇలా కూర్చోవడం వల్ల కండరాలు వంకరగా మారుతాయి.వెన్నుముక కండరాలు బలహీనపడతాయి.
w ఆకారంలో కూర్చున్న పిల్లలకు ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెన్ను నొప్పి, యాంటీరియర్ క్రూసియేట్ లిగ్మెంట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ పిల్లలలో ఎదుగుదల ఉండదు.
వెన్ను బలహీనత, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.