అమ్మ అయిన తర్వాతే ఆడవాళ్లు అందంగా ఉంటారు.. అలియా భట్ కామెంట్స్ కు వావ్ అనాల్సిందే!

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్( Alia Bhatt ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఆలియా పెళ్లి అయిన తర్వాత కూడా అదే ఊపుతో వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

 Alia Bhatt Latest Comments Viral On Social Media, Alia Bhatt, Latest Comments, R-TeluguStop.com

ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే త్వరలోనే ఈమె జిగ్రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ మేరకు ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Telugu Alia Bhatt, Bollywood, Ranbirkapoor, Udta Punjab-Movie

ఈ సందర్భంగా ఆలియా భట్ మాట్లాడుతూ.నేను ఇప్పటివరకు ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించాను.అయినా కూడా ప్రతిసారీ ఎంచుకునే పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాను.ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రకు పరకాయ ప్రవేశం చేయడం అనేది నా దృష్టిలో దుస్తులు మార్చడం లాంటిది.

పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్రల నుంచి బయటికి రావడం చాలా సులభం.కానీ గంగూబాయి కాఠియావాడి( Gangubai Kathiawadi ), ఉడ్తా పంజాబ్‌ లాంటి సినిమాల్లోని పాత్రల నుంచి బయట పడడానికి కొంత సమయం పడుతుంది.

ఇలాంటివి చేయడం సవాలుతో కూడుకున్నవి.అవి చేయడానికి ఎంతో మానసిక ధైర్యం కూడా కావాలి.

Telugu Alia Bhatt, Bollywood, Ranbirkapoor, Udta Punjab-Movie

ఈ భూమికలే తెరపై మన ప్రతిభ ఏంటో నిరూపిస్తాయి అని తెలిపింది ఆలియా భట్.సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను.ఎందుకంటే నేను ఎక్కువగా నా పని మీద దృష్టి పెడతాను.నా మీద వచ్చే విమర్శలకు నా పనే సమాధానం చెప్తుంది.ఇటీవలే తల్లి అయినా కూడా టీనేజ్‌ లుక్‌ పోలేదంటూ నాపై ట్రోల్స్‌ వచ్చాయి.కానీ తల్లి కావడానికి అందంగా కనిపించడానికి సంబంధం లేదు.

ఇంకా చెప్పాలంటే అమ్మ అయిన తర్వాతే ఆడవాళ్లు మరింత అందంగా ఉంటారు.నేను ఇప్పటికీ టీనేజ్‌ అమ్మాయిగా కనిపిస్తున్నానంటే దానికి కారణం రణ్‌బీర్‌.

నేనలా ఉండటమే ఆయనకు ఇష్టం.రణ్‌బీర్‌ నాకు పూర్తిగా భిన్నం.

నేను ఏ విషయాన్నైనా ఎక్కువగా ఆలోచిస్తాను.రణ్‌బీర్‌( RanbirKapoor ) దాన్ని వదిలేసి, తొందరగా ముందుకెళ్లడానికి ఇష్టపడతాడు.

ఈ వ్యక్తిత్వమే ఒకరికొకరం మద్దతు ఇవ్వడంలో సహాయ పడుతుంది.మేమిద్దరం ఎప్పుడూ ఒకరి మీద మరొకరం చాలా గౌరవంతో, ప్రేమతో ఉంటాము అని తెలిపింది అలియా భట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube