మనకందరికీ తెలిసిన విషయమే నీటిలో రారాజు ఎవరంటే మొసలి( crocodile ) అని సమాధానం వస్తుంది.నీటిలో దిగిన తర్వాత ఏ జంతువు అయినా సరే దాని ముందర ఓ చిన్న ప్రాణి అంతే.
నీటిలో ముసలి కంట పడితే మాత్రం ఇక జీవితం మీద ఆశలు వదులుకోవాల్సిందే.నీటిలో ప్రయాణించే సమయంలో ముసలి నోటికి చిక్కితే మాత్రం దానికి కచ్చితంగా ఆహారం అయిపోవాల్సింది ఎవరైనా.
కాకపోతే అలాంటి మొసలి భూమి మీదికి వస్తే దాని బలం కాస్త క్షీణించినట్లుగా కనబడుతుంది.కాకపోతే ప్రస్తుతం వైరల్ గా మారిన ఓ వీడియోలో మాత్రం బయటికి వచ్చిన దాని శక్తి ఏమాత్రం తగ్గలేదంటూ అర్థమవుతుంది.
ఇక వైరల్ గా మారిన వీడియోలో జూలో పూర్తిగా బురదతో నిండిపోయిన నీటిమడుగులో ఓ మొసలి ఒడ్డున ఉండి సేద తీర్చుకుంటుంది.అయితే ఆ మోసలి చూడటానికి అస్సలు కనపరాదు.ఎందుకంటే., దాని చుట్టూ నల్ల మట్టి ఉంది.అయితే అక్కడ ముసలిని ఉండడం చూసి ఓ వ్యక్తి తన కెమెరాలో మొసలిని బంధించాలని ట్రై చేయగా మొదటగా సైలెంట్ గా ఉన్న ఆ ముసలి మడుగు నుంచి ఒక్కసారిగా సందర్శకుడి పైకి దూకి దాడి చేసింది.
ఈ దెబ్బతో ఒక్కసారిగా సందర్శకుడు భయభ్రాంతులకు లోనై అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.ఆయనతోపాటు చాలామంది అక్కడ కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఈ వీడియోని చూసిన కొందరు నెటిజెన్లు కామెంట్ చేస్తూ ఒడ్డు మీద కూడా మొసళ్ళు దాడి చేయగలవు కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని ఓసారి చూసేయండి.