బన్నీ విషయంలో అలా కామెంట్ రైటేనా నాగబాబు.. ఎన్నికల ముందే చేసి ఉండొచ్చుగా?

జనసేన పార్టీ( Janasena party )కి లేనిపోని తలనొప్పుని తెచ్చి పెట్టడానికి ఎవ్వరు అవసరం లేదు ఒక నాగబాబు చాలు.ఇదే విషయం గతంలో చాలా సార్లు రుజువైన విషయం తెలిసిందే.

 Naga Babu Latest Tweet Viral On Social Media, Naga Babu, Tollywood, Allu Arjun,-TeluguStop.com

కోపంలో ఆయన ముందు వెనక ఆలోచించకుండా వెంటనే మాట అనడం ఆ తర్వాత జనసేన పార్టీకి లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టడం ఆయనకు అలవాటు అయిపోయింది.ప్రస్తుతం తెలుగుదేశంతో పొత్తు వుంది.

అదృష్టం బాగుండి అధికారం అందితే అన్ని విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాల్సి వుంటుంది.దుందుడుకు వైఖరి అస్సలు పనికి రాదు.

Telugu Allu Arjun, Janasena, Latest Tweet, Naga Babu, Raja Mouli, Tollywood, Ven

కాబట్టి ఇంతకుముందు లాగ కాకుండా నాగబాబు( Naga Babu) ఇప్పుడు ఆచి తూచి మాట్లాడడం చాలా మంచిది.నిన్నటికి నిన్న అల్లు అర్జున్ ను ఉద్దేశించి పరోక్షంగా నాగబాబు వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు మెగా ఫ్యామిలీ గురించి అందరూ చర్చించుకునేలా చేసింది.గతంలో బన్నీ చెప్పను బ్రదర్ అన్నపుడు కానీ మెగాస్టార్ మరోసారి సినిమాలు స్టార్ట్ చేసాక ఒక్క సినిమా గీతా బ్యానర్ లో చేయకపోవడం, అల్లు స్టూడియో, అల్లు ఎంటర్ టైన్ మెంట్ అంటూ తమకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునే ప్రయత్నం ఇవన్నీ కలిసి మెగా ఫ్యామిలీ లో అల్లు ఫ్యామిలీ వేరు అనే భావనను అనేక సార్లు చెప్పకనే చెప్పాయి.స్వయం కృషితో బన్నీ ఎదిగాడు.

పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

Telugu Allu Arjun, Janasena, Latest Tweet, Naga Babu, Raja Mouli, Tollywood, Ven

మిగిలిన పాన్ ఇండియా స్టార్ లు అందరినీ రాజమౌళి తయారు చేస్తే, బన్నీ తానే దర్శకుడు సుకుమార్ ను పాన్ ఇండియా డైరక్టర్ ను చేసాడు.తాజాగా ఎన్నికల సందర్భంగా తన మిత్రుడు కదా అని వైకాపా అభ్యర్ధికీ మద్దుతుగా బన్నీ వెళ్లడం తప్పేమీ కాదు.హీరో వెంకటేష్( Venkatesh ) తమ బంధువులు కదా అని తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్ధికి, ఆంధ్రలో భాజపా అభ్యర్ధి కామినేని శ్రీనివాస్ కు మద్దతుగా ప్రచారానికి వెళ్లలేదా? మెగాస్టార్ నే పలువురికి మద్దతుగా వీడియో బైట్ లు ఇవ్వలేదా వ్యక్తిగతంగా ఎవరి అభిమానాలు వారికి వుంటాయి.నాగబాబు దానిని విస్మరించి, బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదు.ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేసి వుంటే వేరేలా వుండేది.బన్నీకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు.తెలుగుదేశం జనసేన మధ్య ఎప్పటికైనా మిత్ర బేధం అనేది వస్తే దానికి కారణం నాగబాబే కావడానికి ఎక్కువ కారణం అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube