తాజాగా ఏపీలో ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఆయన భార్యతో కలిసి వెళ్లి ఓటు హక్కును నిర్వహించుకున్న విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవ్వడంతో కాస్త కళ్లు తెరిచి చూడు జగన్, పోతిన మహేష్ అంటూ జనసైనికులు రెచ్చిపోతున్నారు.
నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే ఓటు వేయడానికి వచ్చిన పవన్ గురించి ఆయన భార్య గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా( Anna Lezhneva) గురించి ఆమె సింప్లిసిటీ గురించి మాట్లాడుకుంటున్నారు.

పవన్ భార్య మరీ అంత సింపుల్‌నా.మెడలో మంగళసూత్రం చూశారా? అంటూ పోలింగ్ బూత్ దగ్గర జనం మాట్లాడుకుంటున్నారు.ఓటు వేసేందుకు సతీ సమేతంగా వచ్చిన పవర్ స్టార్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
ఇక పవన్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.అయితే అవేమీ పట్టించుకోకుండా పవన్ తన భార్యతో కలిసి ఓటు వేశారు.అన్నా లెజినోవా చూసిన స్థానిక ప్రజలు, అభిమానులంతా ఆశ్యర్యపోయారు.ఆమె ఎలాంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్ లుక్కుతో ఓటు వేసేందుకు వచ్చారు.

పవన్ కళ్యాణ్ భార్య మరీ అంత సింపుల్‌నా మెడలో మంగళసూత్రం చూశారా? అయితే ఆమె కట్టుకున్న చీర నుంచి పెట్టుకున్న జువెలరీ వరకు అంతా సింపుల్ సిటీతో కనిపించారు.మెడలో కూడా సింగిల్ లైన్ ఉన్న మంగళ సూత్రం వేసుకున్నారు.చేతులకు సింగిల్ బ్యాంగిల్స్ వేశారు.ఇక నుదుటున చిన్న బొట్టు పెట్టుకున్నారు.ఆమె కట్టుకున్న చీర కూడా చాలా సాధారణంగా కనిపించింది.చూడటానికి అది కాటన్ శారీలా కనిపిస్తుంది.
దీంతో పవర్ స్టార్ భార్య అయినా అంత సింపుల్‌గా ఉన్నారా? అంటూ ఆమెను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.