స్టార్ హీరో బాలయ్య ఖాతాలో మరో అరుదైన ఘనత.. ఏ స్టార్ హీరో బ్రేక్ చేయలేరుగా!

టాలీవుడ్ స్టార్ హీరో నందుమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) ప్రస్తుతం క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నారనే రంగతి తెలిసిందే.వరుస విజయాలు బాలయ్య స్థాయిని అంతకంతకూ పెంచుతుండగా అరుదైన ఘనతలు బాలయ్య ఇమేజ్ ను మార్చేస్తున్నాయి.

 Balakrishna Bhagavanth Kesari Rare Record Details Here Goes Viral In Social Me-TeluguStop.com

బాలయ్య గత సినిమా భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )బాక్సాఫీస్ వద్ద 132 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

Telugu Anil Ravi Pudi, Sreeleela-Movie

చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ ( Ramakrishna Theatre )లో రోజుకు 4 ఆటలతో ఈ సినిమా సంచలనం సృష్టించింది.గతంలో పోకిరి మూవీ ఈ థియేటర్ లో 200 రోజులు ఆడగా ఇప్పుడు ఈ సినిమా కూడా 200 రోజులు ఆడి వార్తల్లో నిలిచింది.భగవంత్ కేసరి విడుదలై దాదాపుగా ఆరు నెలలు అవుతున్నా ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.బాలయ్య రికార్డ్స్ ను ఏ స్టార్ హీరో బ్రేక్ చేయలేరని నెటిజన్లు చెబుతున్నారు.

Telugu Anil Ravi Pudi, Sreeleela-Movie

బాలయ్య తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది.అఖండ సినిమాకు ముందు వరుస ఫ్లాపులు బాలయ్య మార్కెట్ ను దెబ్బ తీశాయి.అయితే బాలయ్య మాత్రం తెలివిగా అడుగులు వేయడం ద్వారా మార్కెట్ ను పెంచుకుని వార్తల్లో నిలిచారు.భగవంత్ కేసరి బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.

బాలయ్య మాస్ సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడతారు.బాలయ్య బాబీ కాంబో సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

బాలయ్య బాబీ కాంబో మూవీలో బాలయ్య తనకు అచ్చొచ్చిన డ్యూయల్ రోల్ లోనే కనిపించనున్నారని సమాచారం అందుతోంది.ఒకింత క్రేజీ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube