ఈ కమెడియన్లు ఒకప్పుడు స్టార్స్ అని మీకు తెలుసా.. వాళ్లకు ఈ రేంజ్ లో గుర్తింపు ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంతో పోల్చి చూస్తే కమెడియన్లకు ఒకింత డిమాండ్ తగ్గిందనే చెప్పాలి.ప్రస్తుతం అన్ని సినిమలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో కమెడియన్లకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు.

 These Comedians Are Star Comedians Details Here Goes Viral In Social Media , Kov-TeluguStop.com

చాలామంది కమెడియన్లకు మంచి గుర్తింపు ఉన్నా వరుసగా అవకాశాలను సొంతం చేసుకునే విషయంలో ఈ కమెడియన్లు ఫెయిల్ అవుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుధాకర్ కమెడియన్( Sudhakar ) గా ఒక వెలుగు వెలిగారనే సంగతి తెలిసిందే.ఎన్నో హిట్ సినిమాల సక్సెస్ లో సుధాకర్ కామెడీ టైమింగ్ కీలక పాత్ర పోషించింది.వెంకటేశ్, సుధాకర్ కాంబినేషన్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి.అయితే తెలుగులో కమెడియన్ గా గుర్తింపు రావడానికి ముందే తమిళంలో సుధాకర్ హీరోగా ఒక వెలుగు వెలిగారు.

తమిళనాడు సినీ పరిశ్రమలో రాజకీయాలు నచ్చక ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రముఖ నటి కోవైసరళ( Kovai Sarala ) కూడా ఒకప్పుడు కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించారు.కమల్ హాసన్ కూడా ఒకప్పుడు కోవై సరళ డేట్స్ కోసం ఎదురుచూశారంటే ఆమె డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని చెప్పవచ్చు.ఎఫ్2, ఎఫ్3 సినిమాలో అంతేగా అంతేగా డైలాగ్ తో ప్రదీప్ అనే నటుడు పాపులర్ కాగా ఈ నటుడు కూడా ఒకప్పుడు హీరోగా చేశారు.ఎఫ్2, ఎఫ్3సినిమాలు సక్సెస్ సాధించినా ప్రదీప్( Pradeep ) మాత్రం కెరీర్ పరంగా ఆశించిన స్థాయికి ఎదగలేదనే సంగతి తెలిసిందే.ప్రదీప్ రాబోయే రోజుల్లో మరిన్ని మూవీ ఆఫర్లతో బిజీ కావాలని ఆశిద్దాం.

అంతేగా అంతేగా డైలాగ్ తో పాపులర్ అయిన ఈ కమెడియన్ కు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube