వైరల్ వీడియో: మ్యాచ్ లో బాల్ దొంగతనం చేశాడని వ్యక్తిని చితకబాదిన పోలీసులు..

ప్రస్తుతం ఐపీఎల్ 17 సీజన్( IPL 17 Season ) ఆఖరి ఘట్టానికి చేరుకుంది.దాదాపు లీగ్ మ్యాచ్ లన్ని ముగిసి ప్లే ఆఫ్ స్థానాల కొరకు పోటాపోటీగా మ్యాచులు జరుగుతున్నాయి.

 The Police Crushed The Man For Stealing The Ball In The Viral Video Match, Ipl 2-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గత శనివారం కలకత్తా, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భాగంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

మ్యాచ్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో 16 ఓవర్లకు మ్యాచ్ జరగగా.అందులో కలకత్తా 18 పరుగులు తేడాతో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians )పై అఖండ విజయాన్ని సాధించింది.అయితే మ్యాచ్ సందర్భంగా బ్యాటర్ కొట్టిన బంతిని అభిమాని అత్యుత్సాహంతో దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు.

సిక్సర్ కొట్టిన సమయంలో స్టాండ్స్ లో పడిన బంతిని గ్రౌండులోకి ఇవ్వకుండా ప్యాంటు జోబులో వేసుకునే ప్రయత్నం చేశాడు ఘనుడు.అయితే అతడు చేసిన దొంగతనాన్ని కనిపెట్టిన పోలీసులు వారి స్టైల్ లో బంతిని లాక్కొని అతనికి కోటింగ్ ఇచ్చారు.

అంతేకాదు స్టేడియం నుండి బయటకు వెళ్లగొట్టారు కూడా.

కలకత్తా నైట్ రైడర్స్ ( Calcutta Knight Riders )జెర్సీ వేసుకున్న అభిమాని పోలీసులకు ఏదో చెప్పే ప్రయత్నం చేయగా.కాకపోతే., వారు మాత్రం అతడి మాటలు వినిపించుకోకుండా.

అతనిని గ్రౌండ్ నుండి బయటకు పంపించేశారు.అతడు ఏదో ఫన్నీగా కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకున్నాడు.

కానీ., అది కాస్త పోలీసులు సీరియస్ గా తీసుకోవడంతో అతడిని గ్రౌండ్ నుంచి పోలీసులు బయటికి పంపించేశారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి చూసేయండి.

https://twitter.com/mufaddal_vohra/status/1790223185033761074
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube