ప్రస్తుత అమెరికా( America ) తీరుపై భారత్( India ) ఒక్కసారిగా షాక్ తిన్నది.భారతీయ విద్యార్థుల( Indian Students ) పట్ల అమెరికా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
కొందరిని ఏకంగా 40 గంటల పాటు చేతులకు సంకెళ్లు వేసి చిత్రహింసలు పెట్టారని తెలుస్తోంది.అయితే, లూధియానాకు( Ludhiana ) చెందిన 21 ఏళ్ల ముస్కాన్‌కు( Muskan ) జరిగిన ఘోరం మాత్రం అందరినీ నివ్వెరపోయేలా చేసింది.
ఉన్నట్టుండి మెక్సికోలో అరెస్ట్ చేసి.కారణం చెప్పకుండానే ఇండియాకి డిపోర్ట్ చేశారు.
ముస్కాన్ లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేస్తోంది.తన స్నేహితులతో కలిసి మెక్సికోలోని( Mexico ) టిజువానా సరిహద్దుకు విహారయాత్రకు వెళ్లింది.తాము అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించలేదని ముస్కాన్ గట్టిగా చెబుతోంది.
కానీ, అమెరికా అధికారులు ఆమెను ఉన్నట్టుండి అదుపులోకి తీసుకున్నారు.ఏకంగా 10 రోజులు కస్టడీలో పెట్టారు.
ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.కనీసం తన వెర్షన్ వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.

ముస్కాన్‌ను డిపోర్ట్( Deport ) చేస్తున్నట్లు కూడా ఆమెకు చెప్పనేలేదు.సైనిక విమానంలో ఇండియాకు తీసుకొచ్చారు.విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయ్యాకే.తను ఇండియాకు వచ్చేసినట్లు ముస్కాన్‌కు తెలిసింది.ఊహించని ఈ పరిణామంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ముస్కాన్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.కూతురు భవిష్యత్తు కోసం రూ.15 లక్షలు అప్పు చేసి లండన్‌లో చదివిస్తున్నారు.ఉన్నట్టుండి ఇలా జరగడంతో వాళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.ముస్కాన్‌ను తిరిగి లండన్‌కు( London ) పంపించి, ఆమె చదువు పూర్తి చేసేలా ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటున్నారు.
సీయూ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తోంది ముస్కాన్.

ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేశామని అమెరికా చెబుతోంది.కానీ, ఇలాంటి ఘటనలు చూస్తుంటే, అమాయకులు కూడా బలి అవుతున్నారని అనిపిస్తోంది.ముస్కాన్‌ను అధికారులు కనీసం ప్రశ్నించలేదు, లీగల్ హియరింగ్ లేదు, అరెస్ట్ చేయడానికి కారణం చెప్పలేదు.
ఇది ఎంత దారుణం, ఎంత అన్యాయం, మానవత్వం లేని చర్య ఇది అని నెటిజన్లు మండిపడుతున్నారు.
భారత ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సీరియస్‌గా దృష్టి పెట్టి విచారణ జరిపించాలని కోరుతున్నారు.
ముస్కాన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ముస్కాన్ తిరిగి లండన్‌లోని తన కాలేజీకి వెళ్లి చదువు పూర్తి చేసుకునేలా చూడాలి.
ఆమెకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు.