ఓపెన్ రిలేషన్‌షిప్‌లో( Open Relationship ) ఇద్దరు పార్ట్‌నర్స్ ఒక ఒప్పందం చేసుకుంటారు.దాని ప్రకారం వాళ్లిద్దరూ ప్రేమ, శృంగారం లాంటి విషయాల్లో బయటి వ్యక్తులతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చు.
కానీ, వాళ్ల అసలు బంధం మాత్రం చాలా బలంగానే ఉంటుంది.ఇలాంటి రిలేషన్‌షిప్‌లో( Relationship ) నమ్మకం, నిజాయితీ, ఓపెన్‌గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం.
సీక్రెట్‌గా దాచకుండా, మోసం చేయకుండా ఉండటానికి ఇద్దరూ కొన్ని రూల్స్ పెట్టుకుంటారు.
అయితే డేనియల్( Danielle ) అనే ఒక మహిళ తన 15 ఏళ్ల ఓపెన్ రిలేషన్‌షిప్ జర్నీ గురించి రీసెంట్‌గా సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి తన సంబంధం ఎలా మారిందో చెప్పింది.“మేం ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉండి 15 ఏళ్లు అయింది.ఈ టైమ్‌లో మా రిలేషన్‌షిప్ చాలా ఫేజ్‌లు చూసింది.ఎందుకంటే మేం మారుతున్న కొద్దీ మా బంధం కూడా మారుతూ వచ్చింది.మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పడానికి రెడీగా ఉన్నా.కానీ ఇక్కడ చాలా చలిగా ఉంది.లిఫ్ట్‌లో ఉండి అయితే చెప్పలేను.” అంటూ క్యాప్షన్ పెట్టింది డేనియల్.

ఆ వీడియోలో డేనియల్ వాళ్ల ఓపెన్ రిలేషన్‌షిప్ ఎలా సాగిందో చెప్పింది.“నేను, నా భర్త ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.మేం ఎంత తరచుగా డేటింగ్( Dating ) చేస్తాం, వేరే వాళ్లతో శృంగార సంబంధాలు పెట్టుకుంటామంటే, అది మా రిలేషన్‌షిప్ ఏ ఫేజ్‌లో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది” అని చెప్పింది డేనియల్.
వాళ్లిద్దరూ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓపెన్ రిలేషన్‌షిప్ అంటే చాలా ఎగ్జైటింగ్‌గా, క్యాజువల్‌గా ఉండేదట.“మేం ఆ టైంలోనే మా ఫస్ట్ స్వింగర్స్ క్లబ్‌కి వెళ్లాం” అని గుర్తు చేసుకుంది.తర్వాత కెరీర్‌లో బిజీ అయిపోవడంతో వాళ్లిద్దరూ వర్క్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారట.
అప్పుడు వేర్వేరు సిటీల్లో కలిసిన వాళ్లతో మాత్రమే డేటింగ్ చేసేవాళ్లట.

పిల్లలు పుట్టాక సీన్ మొత్తం మారిపోయింది.“మేం కొన్నాళ్లు మొనోగమి( Monogamy ) (ఒకరికే కట్టుబడి ఉండటం) ఫేజ్‌లో ఉన్నాం.ఎందుకంటే మాకు సరిగ్గా నిద్రపోవడానికే టైమ్ ఉండేది కాదు.
ఇక డేటింగ్ ఏంటి? ఇంకొకరితో రిలేషన్ ఏంటి?” అని చెప్పింది డేనియల్.
ఆ తర్వాత మళ్లీ వేరే ఫేజ్‌లోకి వచ్చారట.
అప్పుడు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులతో రిలేషన్స్‌లో ఉండేవారు.అలా వేరే పార్ట్‌నర్స్‌తో వీక్లీ డేట్ నైట్స్, కాల్స్, వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటూనే, ఒకరికొకరు కమిట్‌మెంట్‌తో ఉండేవారట.“ఆ ఫేజ్ కాస్త పాలియామరి (చాలామందితో రాసలీలల సంబంధాలు పెట్టుకోవడం)కి దగ్గరగా ఉండేది.చాలా షెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చేది” అని ఒప్పుకుంది డేనియల్.
వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఫేజ్ చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది డేనియల్.“నేను దానికి కరెక్ట్‌గా పేరు పెట్టలేను కానీ.సంవత్సరాలు గడిచే కొద్దీ మాకు క్యాజువల్ రిలేషన్స్, పార్ట్‌నర్స్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇలా చాలా రకాలుగా ఉండేవి.మా మ్యారేజ్ బయట రిలేషన్స్ ఎంత తరచుగా, ఎంత సీరియస్‌గా ఉండాలనేది మారుతూ వచ్చింది.
ఇకముందు కూడా మారొచ్చు” అని తన మనసులో మాట చెప్పింది డేనియల్.







