సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.ఇక వాళ్లతో పాటుగా సమానమైన క్రేజ్ ను రాబట్టుకున్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి…( Sai Pallavi ) ప్రస్తుతం ఆమె ఏ సినిమా చేసిన కూడా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది.
గత సంవత్సరం అమరన్( Amaran ) సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆమె ఈ సంవత్సరం తండేల్( Thandel Movie ) సినిమాతో మంచి విజయాన్ని సాధించింది.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో పాటు సాయి పల్లవి నటనకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా సాయి పల్లవి లాంటి నటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తుండడం వల్ల ఆమె క్రేజ్ పెరగడమే కాకుండా సినిమా సక్సెస్ రేట్ కూడా పెరుగుతుందనే చెప్పాలి.ఇక నిజానికి ఆమె తన పాత్రకి ప్రియారిటీ ఉంటేనే సినిమాకి కమిట్ అవుతుంది.లేకపోతే మాత్రం అసలు కమిట్ అవ్వదు.అలాగే చాలా రూల్స్ కూడా పెడుతుంది అంటూ కొంతమంది ప్రొడ్యూసర్లు ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పటికి ఆమె స్క్రీన్ మీద ఉంటే చాలు సగటు ప్రేక్షకులందరూ ఆమెను చూడడానికైనా సినిమా థియేటర్ కి వస్తారనే ఉద్దేశ్యంతో ఆమెను ప్రతి సినిమాలో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక ఆమె చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఉండడం విశేషం… మరి ఫ్యూచర్ లో కూడా ఆమె చేసే ప్రతి సినిమా సక్సెస్ అవుతుందా? అలాగే ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.