హేమమాలిని.( Hemamalini ) 70 వ దశకంలో ఈమె ఒక స్టార్ హీరోయిన్.ఎంతో మందికి ఒక డ్రీమ్ గర్ల్. వందకు పైగా సినిమాల్లో నటించిన హేమ మాలిని, సినిమాల్లో నటిస్తున్న సమయంలో తన తోటి నటుడు అయినా ధర్మేంద్ర ను( Dharmendra ) ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వీరి పెళ్లి 1980 లో జరగగా, అప్పటికే ధర్మేంద్ర కు పెళ్లి జరిగి నలుగురు పిల్లలు ఉన్నారు.ధర్మేంద్ర మొదటి పెళ్ళికి రెండో పెళ్లికి ముప్పై ఏళ్ళ గ్యాప్ ఉండడం విశేషం.
ఇక వీరి మధ్య ప్రేమ బంధం చాల గాఢమైనది అంటూ ఉంటారు బాలీవుడ్ లో.వీరికి ఇద్దరు కుమార్తెలు ఇషా, అహనా కూడా ఉన్నారు .అయితే వీరి పెళ్లి తరవాత జరిగిన ఒక సంఘటన ఇటీవల బయటకు వచ్చింది.

హేమ మాలిని తొలిసారి గర్భవతి( Pregnant ) అయినప్పుడు పురుడు కోసం ఏకంగా వంద పడకల ఆసుపత్రి మొత్తాన్ని ఖాళి చేయించి హేమమాలిని కోసం ధర్మేంద్ర బుక్ చేశారట.1981 లో ఇషా ( Esha ) జన్మించగా, ఆమె కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ధర్మేంద్ర ఇలా చేశారట.ఈ విషయం హేమ మాలిని స్నేహితురాలు బయట పెట్టడం తో అందరికి తెలిసింది.
దీనికి సంబందించిన ఒక పాత వీడియో సైతం ఇప్పుడు వైరల్ గా మారింది.మరి ఇలా పబ్లిక్ ఉండే ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలనుకుంటే కొంత మేర ఇబ్బంది ఉంటుంది.
ఆ మాత్రం దానికి ఆసుపత్రి మొత్త బుక్ చేసుకోవాలా అంటూ కొంత మంది సోషల్ మీడియాలో పెదవి విరుస్తున్నారు.

ఇప్పటి తరం హీరోయిన్స్ అయితే విదేశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ జనాల్లో కలిసిపోయి అక్కడే పిల్లలను కంటున్నారు.కానీ ఆ రోజుల్లో మరి అంత ఖర్చు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఇలా ముంబై లోని ఒక ఆసుపత్రిని హేమమాలిని కోసం ధర్మేంద్ర బుక్ చేయడం మాత్రం సంచలనం గా మారింది.ఏది ఏమైనా ఎంత ప్రేమ ఉంటె ఇలా చేస్తారు చెప్పండి.
ఇక ధర్మేంద్ర మరియు హేమ మాలిని మాత్రం ప్రస్తుతం వేరు వేరు గా ఉంటున్నారు.వారు ఇంకా విడాకులు తీసుకోలేదు కానీ 40 ఏళ్ళ దాంపత్య బంధాన్ని కాదని ఒంటరిగా ఉంటుందట హేమమాలిని.
ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.







