కండరాల క్షీణత. వయసు పెరిగే కొద్ది ప్రధానంగా కనిపించే సమస్యల్లో ఇదీ ఒకటి.
అలాగే విటమిన్ డి లోపించడం, నరాలు దెబ్బ తినడం, డిప్రెషన్, పోషకాల కొరత, పలు రకాల వ్యాధుల వల్ల కూడా కండరాలు క్షీణిస్తాయి.అయితే కారణం ఏదేమైనప్పటికీ.
శరీరంలో అత్యంత కీలక పాత్రను పోషించే కండరాలు బలహీన పడితే మనిషి కూడా బలహీనంగా మారిపోతారు.ఫలితంగా ఏ పని చేయలేరు.
కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.అందుకే కండరాలను బలంగా మార్చుకోవడం ఎంతో అవసరం.
అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయ పడతాయి.మరి ఆ ఆహారాలు ఏంటో లేట్ చేయ కుండా ఇప్పుడు తెలుసు కుందాం.
కండాల క్షీణత దరి చేరకుండా ఉండాలీ అంటే.శరీరానికి పుష్కలంగా ప్రోటీన్ మరియు కాల్షియం, ను అందించాలి.
అంటే గుడ్డు, పాలు, పెరుగు, బాదం పప్పు, ఓట్స్, చికెన్ బ్రెస్ట్, గుమ్మడి గింజలు, సోయా బీన్స్ వంటివి తీసుకుంటే ప్రోటీన్, కాల్షియం శరీరానికి అంది కండరాలు బలంగా మారతాయి.
అలాగే అంజీరా, అరటి పండు, క్యాబేజీ, చిక్కుళ్లు, పప్పులు, చేపలు వంటి ఆహారాల్లో మెగ్నీషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
మెగ్నీషియం అనేది కండరాలను బలహీన పడకుండా అడ్డు కట్ట వేయగలదు.అందు వల్ల, ఆ ఫుడ్స్‌ను తరచూ తీసుకుంటూ ఉండాలి.

కండరాల క్షీణత దరి చేరకూడ దంటే విటమిన్ డి కూడా ఎంతో అవసరం.అందుకే రోజూ ఉదయాన్నే ఎండలో ఇరవై నిమిషాలు అయినా ఉండాలి.మరియు విటమిన్ డి ఉండే ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి.
ఉసిరి కాయలు కండరాలను బలంగా ఉంచడంలో గ్రేట్‌గా సహాయ పడతాయి.కాబట్టి, ఉసిరి కాయలను తరచూ తీసుకుంటే కండరాల క్షీణత ఏర్పకుండా ఉంటుంది.మరియు ఇమ్యూనిటీ పవర్ సైతం పెరుగు తుంది.
ఇక కండరాలు బలంగా ఉండాలీ అంటే వ్యాయామం కూడా ఎంతో ముఖం.రోజూ కనీసం ఒక అర గంటైన కండరాలను పెంచే వ్యాయామాలను చేస్తుండాలి.