బ్యూటీషియన్స్ జాగ్రత్త.. లేదంటే క్యాన్సర్ ముప్పు తప్పదు..?

అండాశయం ప్రతి మహిళకి ఎంతో ముఖ్యమైనది అన్న విషయం దాదాపు చాలామందికి తెలుసు.మహిళా గర్భాశయానికి రెండు వైపులా రెండు అండశయాలు ఉంటాయి.

 Hair Dressers Beauticians Higher Risk Of Ovarian Cancer Details, Hair Dressers,-TeluguStop.com

మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో ఈ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.గర్భం( Pregnancy ) కోసం ప్రతినెలా ఎగ్స్, ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేయడమే అండాశయల పని.అయితే చాలా మంది మహిళలు ఇటీవల కాలంలో అండాశయ క్యాన్సర్( Ovarian Cancer ) బారిన పడుతున్నారు.ఒవేరియన్ క్యాన్సర్ కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడంతో చివరి దశ చేరే వరకు ఈ వ్యాధిని గుర్తుపట్టడం కష్టంగా మారింది.

అందుకే ఒవేరియన్ క్యాన్సర్ నీ సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు.

Telugu Beauticians, Breast Cancer, Cancer, Dressers, Tips, Montreal, Obesity, Ov

మహిళలకు వచ్చే క్యాన్సర్లలో మొదటిది రొమ్ము క్యాన్సర్.కాగా రెండవది జననేంద్రియాల క్యాన్సర్.ఇక అండాశయ క్యాన్సర్ ది మూడవ స్థానం.

చాలా సందర్భాలలో అండాశయ క్యాన్సర్ కు కారణం తెలియదు.అయితే ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ నీ ప్రభావితం చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయి.50 సంవత్సరాలు దాటిన మహిళలలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.అధిక బరువు లేదా ఉబకాయం( Obesity ) ఉండడం కూడా రిస్క్ ను పెంచుతుంది.

అంతేకాకుండా దీర్ఘకాలంగా హెయిర్‌ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లుగా( Beauticians ) పనిచేసే మహిళలకు ఒవేరియన్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని తాజా అధ్యాయంలో తెలిసింది.

Telugu Beauticians, Breast Cancer, Cancer, Dressers, Tips, Montreal, Obesity, Ov

సేల్స్, రిటైల్, వస్త్ర తయారీ, నిర్మాణ తయారీ, నిర్మాణ రంగ పరిశ్రమలలో పనిచేసే వారికి కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది.కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి( Montreal University ) చెందిన శాస్త్రవేత్తలు దాదాపు 1388 మంది మహిళలపై ఒవేరియన్ క్యాన్సర్ అధ్యయనం నిర్వహించారు.ఈ అధ్యయనం చేసిన మహిళల వయసు 18 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య ఉంటుంది.

ఇందులో 491 మందికి అండాశయా క్యాన్సర్ ఉంది.హెయిర్ డ్రెస్సర్లు, హెయిర్‌ కటింగ్, బ్యూటీషియన్లుగా 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పు ముడింతలు ఎక్కువ అని ఈ పరిశోధనలలో తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube