ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ).సుకుమార్ దర్శకత్వంలో రష్మిక( Rashmika ) అల్లు అర్జున్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1800 కోట్లకు పైగా కలెక్షన్లను కాబట్టి సంచలనాలను సృష్టించింది కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతూ ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయినప్పటికీ అల్లు అర్జున్ కి ఏమాత్రం సంతోషం లేదని చెప్పాలి.ఈ సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్( Sandhya Theater ) వద్దకు వెళ్లడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఒక్కసారిగా తరలి రావడం రేవతి అనే అభిమాని మరణించడం జరిగింది.ఈ ఘటన కారణంగా అల్లు అర్జున్ ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.ఈ క్రమంలోనే సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ అరెస్టు( Allu Arjun Arrest ) కారణంతో ఒక ఈవెంట్ కూడా మేకర్స్ నిర్వహించలేదు.

ఇక ఈ ఘటన తర్వాత కూడా అల్లు అర్జున్ పెద్దగా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు.అయితే ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతూ నేడు సాయంత్రం థాంక్యూ మీట్( Pushpa 2 Thank You Meet )ఏర్పాటు చేశారు.అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొనబోతున్నారని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.అల్లు అర్జున్ అరెస్టు తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమానికి రాబోతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు అనే విషయంపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు.







