టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని( PM Narendra Modi ) కలిసిన విషయం తెలిసిందే.ఈ విషయం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.దీంతో అసలు నాగార్జున కుటుంబ సభ్యులు ఎందుకోసం మోదీని కలిశారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.
కాగా అక్కినేని నాగేశ్వరరావు పై( Akkineni Nageswara Rao ) యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్( Yarlagadda Lakshmi Prasad ) రచించిన పుస్తకాన్ని ప్రధాన నరేంద్ర మోడీకి బహుకరించడం కోసం నాగార్జున కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది.

ఇది ఒక కారణం అయితే రాజకీయ వ్యూహం కూడా ఉంది అంటూ ప్రచారాలు నడుస్తున్నాయి.కాగా గతంలో ఏపీలో వైఎస్ జగన్, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునకు పలుకుబడి గురించి చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా వైఎస్ జగన్ , కేటీఆర్ తో నాగార్జునకు మంచి అనుబంధం ఉండేది.
ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి.ముఖ్యంగా తెలంగాణలో నాగార్జునకు కొంత ఇబ్బందికర పరిస్థితి.
నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేసింది.దీని పై నాగార్జున న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు.
అలాగే మంత్రి కొండా సురేఖ ఏ రకంగా నాగార్జునపై నోరు పారేసుకున్నారో అందరికీ తెలిసిందే.

ఆ విషయమై కొండా సురేఖపై( Konda Surekha ) నాగార్జున పరువు నష్టం కేసు వేశారు.ప్రస్తుతం విచారణ జరుగుతోంది.సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) సినీ పరిశ్రమ ప్రముఖులు ఆ మధ్య భేటీ అయ్యారు.
వారిలో నాగార్జున కూడా ఉన్నారు.స్వతహాగా నాగార్జునకు ఎవరితోనూ విభేదాలు పెట్టుకునే స్వభావం లేదు.
కానీ నాగార్జునను ఏదో రకంగా వివాదాల్లోకి లాగుతూ వుంటారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో నాగార్జున కలవడం వెనుక ఒక సంకేతాన్ని పంపాలనే ఆలోచన ఉందనే చర్చకు తెరలేచింది.
మరి నిజంగానే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నట్టుగా నాగార్జున మోదిని కావడం వెనక రాజకీయ వ్యూహం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.







