ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి( Rishab Shetty ) గురించి మనందరికీ తెలిసిందే.కాంతార సినిమా( Kantara ) ముందు వరకు రిషబ్ శెట్టి ఎవరు అన్న విషయం చాలామందికి తెలియదు.
కానీ ఈ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి రావడంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి.కాంతార మూవీ తో రిషబ్ శెట్టి క్రేజ్ కూడా భారీగా పెరిగింది.
ఇకపోతే ఇప్పటికే పార్ట్ 1 విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా పార్ట్ 2( Kantara 2 ) తెరక్కెక్కుతోంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇది కాంతార సినిమాకి ప్రీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.

హోంబలే ఫిల్మ్స్( Hombale Films ) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ దృశ్యాన్ని పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు.రిషబ్ శెట్టి దర్శకుడిగా,నటుడిగా ఒకేసారి వ్యవహరించడం సులభమైన పని కాదు.కానీ ఆయన తన అనుభవంతో సినిమాను అత్యున్నత స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.కాగా ఈ ప్రాజెక్ట్ లో రిషబ్ శెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట.స్క్రీన్ పై అత్యుత్తమ ఫైట్ సీన్స్ అందించేందుకు కళరిపయట్టు, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి కళల్లో ప్రత్యేకంగా మెళకువలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది.

నైపుణ్యం కలిగిన శిక్షణదారుల సారధ్యంలో ఈ తర్ఫీదును పూర్తి చేశాడట.ఈ శిక్షణ ఫలితంగా ఆయన యాక్షన్ సీన్స్( Action Scenes ) మరింత గొప్పగా ఉండే అవకాశం ఉందట.తాజాగా ఈ గ్రాండ్ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ భాగం సినిమా హైలైట్‌గా నిలవనుందని సమాచారం.ఈ భారీ యుద్ధ సన్నివేశాన్ని 500 మంది ప్రొఫెషనల్ ఫైటర్లతో తెరకెక్కించనున్నారట.వీరందరూ యాక్షన్ కొరియోగ్రఫీలో ప్రావీణ్యం కలిగినవారే కావడంతో ఫైట్ సీన్స్ అత్యద్భుతంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వార్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన లొకేషన్‌ను ఎంపిక చేశారు.కానీ ఇప్పటి వరకు ఆ వివరాలను గోప్యంగా ఉంచారు.
భారీ సెట్స్, అధునాతన ఆయుధాలు, ప్రత్యేక ఎఫెక్ట్స్ వాడుతూ యుద్ధ సన్నివేశాన్ని అద్భుతంగా మలచనున్నారట.బాహుబలి( Baahubali ) సినిమాలోని కాళకేయులతో జరిగిన యుద్ధ సీన్ తరహాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే బాహుబలి 2 సినిమా నుంచి కాంతార ఉండబోతోందని తెలుస్తోంది.







