చందు ముండేటి దర్శకత్వంలో సాయి పల్లవి,( Sai Pallavi ) నాగచైతన్య( Naga Chaitanya ) కలిసి నటించిన తాజా చిత్రం తండేల్.( Thandel ) తాజాగా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదలైన మొదటి షోకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి క్యూ కడుతున్నారు.ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లు వచ్చాయి.
ఇది ఇలా ఉంటే ఓవర్సీస్ లో బాక్సాఫీస్ వద్ద తొలిరోజు భారీగా కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ.మరి తొలి రోజు ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబట్టింది అన్న విషయానికి వస్తే.

విదేశాల్లో మొదటి రోజు ఈ చిత్రం 3 లక్షల 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ తెలిపారు.నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పోస్ట్ అని కూడా విడుదల చేసింది.ఆ ఫోటోకి అలలు మరింత బలపడుతున్నాయి అనే క్యాప్షన్ ని కూడా జోడించింది.
త్వరలోనే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.బుక్‌మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా తండేల్ టికెట్స్ అమ్ముడయ్యాయి.

అలాగే ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు సంస్థ తెలిపింది.ప్రస్తుతం వీకెండ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా ఇంకా మరిన్ని ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందని ఈ మూవీ మేకర్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.మరి ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి.ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమాతో అటు నాగచైతన్య ఇటు సాయి పల్లవిలు మరో సూపర్ హిట్ సినిమాను ఖాతాలో వేసుకున్నారు.
అభిమానులు ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయం సాధించింది.







