మళ్లీ ఆ గాయాన్ని గెలుకుతున్నారు.. వైరల్ అవుతున్న నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు!

నాగచైతన్య.( Naga Chaitanya ) కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ హీరో పేరు మారుమగుతున్న విషయం తెలిసిందే.

 Naga Chaitanya Comments Divorce Samantha Details, Samantha, Naga Chaitanya, Naga-TeluguStop.com

ప్రేమ పెళ్లి సినిమాలు విడాకులు అంటూ తరచుగా ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు నాగచైతన్య.అయితే నాగచైతన్య మొదట హీరోయిన్ సమంత( Samantha ) ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

ఆ కారణం ఏంటి అనేది తెలియలేదు.ఇటీవల నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

అయితే గతంలో నాగచైతన్యకు సమంత విడాకులు తీసుకున్న విషయం గురించి చాలా సందర్భాలలో ప్రశ్నలు ఎదురయ్యాయి.సమంతకు ఆ విషయాలపై ప్రశ్నలు ఎదురుగా ఆమె వాటిపై స్పందించింది.

కానీ మొదటిసారి నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలపై స్పందించారు.విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్‌ అయ్యారు.

Telugu Naga Chaitanya, Nagachaitanya, Samantha, Sobhita, Thandel, Tollywood-Movi

ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ… సమంతతో విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ షేర్‌ చేసినా కూడా నెగటివ్‌ కామెంట్లు వస్తున్నాయి.అవి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి.వాటిని నేనూ చదవుతాను.సమంతతో విడిపోయిన తర్వాత ఇద్దరం కలిసే విడాకుల విషయాన్ని ప్రపంచానికి చెప్పాము.వ్యక్తిగత కారణాల వల్ల వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించాము.ఎవరిదారిలో వారి జర్నీ కొనసాగుతుందని తెలిపాము.

మా వ్యక్తిగత జీవితం విషయంలో కాస్త ప్రైవసీ ఇవ్వండి అంటూ అభ్యర్థించాము కూడా, అయితే మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది.ఎన్నో గాసిప్స్‌ వార్తలు వచ్చాయి.

అలాంటి సమయంలో మళ్లీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.

Telugu Naga Chaitanya, Nagachaitanya, Samantha, Sobhita, Thandel, Tollywood-Movi

ఆ ఇంటర్వ్యూ నుంచి కూడా మరికొన్ని వార్తలు ప్రసారం అవుతాయి.అందుకే స్పందించలేదు.కొన్ని సందర్భాల్లో పలు వేదికలపై ఈ విషయం గురించి అడిగారు.

ఆ సమయంలో ఈ టాపిక్‌ గురించి వదిలేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాను.అయినప్పటికీ అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ.

మళ్లీ ఆ గాయాన్ని గెలుకుతున్నారు.కానీ మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు.

మా విడాకుల వార్తలు, కామెంట్ల గురించి ఎవరూ ఫుల్‌ స్టాప్‌ పెట్టడం లేదు.అలాంటి వార్తలు రాసే వారు ఇకనైన ఫుల్‌స్టాప్‌ పెట్టాలి.

నా మీద నెగటివ్‌ కామెంట్లు చేసే వారు ఇకనైనా ఆపేయండి.మీ భవిష్యత్‌ గురించి మంచిగా ఆలోచించండి.

విడాకులు అనేది నా జీవితంలో మాత్రమే జరగలేదు.సమాజంలో చాలామంది లైఫ్‌ లో జరిగాయి.

నేనేమైనా క్రిమినల్‌ను కాదు కదా.నేను ఒక బ్రోకెన్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాను.వెయ్యి సార్లు ఆలోచించే విడాకులు తీసుకున్నాము.మా జీవితంలో విడాకులు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు.చాలారోజుల పాటు చర్చించిన తర్వాతే ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆయన అన్నారు నాగచైతన్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube