మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి నటుడు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయాలు కూడా ఇప్పుడే తెరమీదకి వస్తున్నాయి.
నిజానికి రాజమౌళితో( Rajamouli ) సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయిన ఆ తర్వాత చేసే సినిమాతో ప్లాప్ లను మూటగట్టుకోవాల్సిందే అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.కానీ రాజమౌళి తో ఎన్టీయార్( NTR ) త్రిబుల్ ఆర్ సినిమా( RRR ) చేసిన తర్వాత దేవర( Devara ) సినిమాతో మంచి సక్సెస్ ని సాధించాడు.
కాబట్టి రాజమౌళి బ్యాడ్ రికార్డును కూడా జూనియర్ ఎన్టీఆర్ తుడిపేసాడు.

కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి తో చేస్తున్న సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు.మహేష్ బాబు కూడా రాజమౌళి మీద ఉన్న బ్యాడ్ రికార్డ్ ను తుడిచి పెట్టేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే రాజమౌళితో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నేపధ్యంలో మహేష్ బాబు దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా మీదనే తన డేట్స్ ని కేటాయించబోతున్నాడు.
తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.

ఎలాంటి సక్సెస్ ని సాధిస్తే ఈ సినిమాతో రాజమౌళి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడనేది కూడా తెలియాల్సి ఉంది.మరి మహేష్ బాబు లాంటి నటుడితో సినిమా చేయడం అంటే అంతా ఆశామాషీ వ్యవహారం కాదు.ఆయనకి సెపరేట్ అభిమానులు ఉన్నారు.
ఆ అభిమానులందరిని అలరిస్తూ సినిమాని చేసినప్పుడే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.మరి రాజమౌళి ఈ విషయాల ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే బాగుంటుందంటూ మహేష్ బాబు అభిమానులు సైతం రాజమౌళికి సలహాలైతే ఇస్తున్నారు…ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది…