ప్రయాగరాజ్ మహాకుంభంలో సనాతన ధర్మానికి రష్యా( Russia ) నుంచి వచ్చిన ఇజ్రా( Izra ) అనే యువతీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నాగా సన్యాసుల మహాకుంభ రవాణీ తరువాత ఇజ్రా సనాతన ధర్మం, ఆధ్యాత్మికత, సన్యాసుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి మహాకుంభానికి వచ్చారు.
ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇజ్రా తన గురువు సత్యానంద గిరితో( Satyanand Giri ) కలిసి ఈ యాత్రకు వచ్చారు.ఆమె కథ ప్రపంచవ్యాప్తంగా పాఠకులను ఆకట్టుకుంటోంది.
ఈ సందర్బంగా ఇజ్రా మాట్లాడుతూ, “ఇదే నా తొలి మహాకుంభ యాత్ర.ఇలాంటి ఆధ్యాత్మిక మహామేళా ప్రపంచంలో మరెక్కడా జరగదు.
ఇక్కడ అత్యంత శక్తివంతమైన గురువులు ఉంటారు.వారి ద్వారా ఆధ్యాత్మిక శక్తిని అనుభవించగలుగుతున్నాను” అని అన్నారు.

సన్యాసుల జీవన విధానం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడమే ఆమె ప్రధాన లక్ష్యం.ఆమె గురువు సత్యానంద గిరి మాట్లాడుతూ, “ఇజ్రా గురుమంత్రం స్వీకరించి కొత్త ఆధ్యాత్మిక జీవన యాత్రను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది” అని వెల్లడించారు.ఆమె సహజమైన అందం అందరిని ఆకట్టుకుంటోంది.మోడల్ హర్ష రిచారియా, ఇండోర్ కు చెందిన తేనె కళ్లతో ప్రసిద్ధి పొందిన మోనాలిసా ( Monalisa ) వంటి ప్రముఖులను కూడా ఇజ్రా వెనక్కి నెట్టేసింది.
ఇజ్రా మేకప్ చేయకుండా సహజసిద్ధమైన అందంతోనే ఆకర్షిస్తోంది.ఆమెకు ఎలాంటి ప్రమోటర్లు లేకపోయినా, ఆమె సౌందర్యం, సాదాసీదా జీవన విధానం ఆమెను సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చాయి.

ఇజ్రా మహాకుంభంలో( Mahakumbh ) పెద్ద సంఖ్యలో యువతను ఆకర్షిస్తోంది.ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి యువత క్యూలో నిలుస్తోంది.ఆమె గురువు సత్యానంద గిరి శిబిరం వద్ద అందరూ ఆమెను కలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.ఈ మహాకుంభ మేళాలో ఇజ్రా రాకతో యువతకు సనాతన ధర్మం మీద కొత్త ఆవగాహన ఏర్పడుతోంది.
ఈ ఆధ్యాత్మిక యాత్ర ఆమె జీవితంలో మరింత ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పవచ్చు.సనాతన ధర్మం అందరినీ ఆకర్షించే విశ్వసందేశం ఇజ్రా వంటి యువతుల ద్వారా విస్తరించనుంది.







