టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ( Star comedian Brahmanandam )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బ్రహ్మానందం నటించిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.
బ్రహ్మానందం వయస్సు 69 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.బ్రహ్మానందం తెరపై కనిపిస్తే ప్రేక్షకులు మనస్పూర్తిగా నవ్వుతారనే సంగతి తెలిసిందే.
ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బ్రహ్మానందం థియేటర్లో చూసిన చివరి టాలీవుడ్ మూవీ అన్నమయ్య( Annamaya ) కావడం గమనార్హం 1997 సంవత్సరం అన్నమయ్య మూవీ థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది.
బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్( Raja Gautham ) తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.బ్రహ్మానందం కొడుకు బ్రహ్మా ఆనందం సినిమాతో( Brahma Anandam ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా కనిపించనున్నారు.బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ రోల్ లో ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ లేవు.బ్రహ్మా ఆనందం మూవీపై ఒక వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

బ్రహ్మా ఆనందం మూవీ టాలీవుడ్ మెమరబుల్ సినిమాలలో ఒకటిగా నిలుస్తుందేమో చూడాలి.ఈ నెల 14వ తేదీన బ్రహ్మా ఆనందం మూవీ థియేటర్లలో విడుదల కానుంది.ఏడు పదుల వయస్సులో కూడా బ్రహ్మానందం అద్భుతమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.
బ్రహ్మానందం ఒకప్పుడు రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు.బ్రహ్మానందం కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.బ్రహ్మా ఆనందం మూవీ కమర్షియల్ గా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.బ్రహ్మా ఆనందం రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.







