ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025( ICC Men’s Champions Trophy 2025 ) కు మరింత ఉత్సాహం తెచ్చేందుకు ప్రఖ్యాత గాయకుడు అతిఫ్ అస్లాం పాడిన అధికారిక గీతం “జీతో బాజీ ఖేల్ కే” ( Jeeto Baaji Khel Ke )ను విడుదల చేశారు.ఈ గీతం పాకిస్తాన్, యూఏఈలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
టోర్నమెంట్ కౌంట్‌డౌన్ మొదలైన ఈ సమయంలో ఈ పాట అభిమానులను మరింత ఉత్సాహానికి, ఉత్తేజానికి గురి చేస్తోంది.

ఈ గీతాన్ని అబ్దుల్లా సిద్ధిఖీ సంగీతం అందించగా, అద్నాన్ ధూల్( Adnan Dhul ) అలాగే అస్ఫాండ్యార్ అసద్( Asfandyar Asad ) లు లిరిక్స్ రాశారు.మ్యూజిక్ వీడియోలో పాకిస్తాన్ వీధులు, మార్కెట్లు, స్టేడియం లాంటి విభిన్న సంస్కృతుల ప్రతిబింబం చారిత్రకంగా చూపబడింది.ఈ వీడియో క్రికెట్ పట్ల ఉన్న ప్రజల ప్రేమను, ఉల్లాసాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది.
ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్ట్రీమింగ్ ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉంచారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానుల కోసం ఈ పాట మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.ప్రత్యేకంగా ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో ప్రేక్షకుల మధ్య ఉత్కంఠను పెంచడానికి ఈ పాట అద్భుతంగా సహాయపడనుంది.

ఈ పాటకు సంబంధించి ఐసీసీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా( ICC Chief Commercial Officer Anurag Dahiya ) మాట్లాడుతూ.“ఈ టోర్నమెంట్‌కు ముందు అభిమానుల ఉత్సాహం మరింత పెరుగుతోంది.అధికారిక పాట ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ప్రత్యేకతను చాటుతుంది.టిక్కెట్లు త్వరగా బుక్ చేసుకోవాలని అభిమానులను కోరుతున్నట్లు తెలిపారు.అలాగే PCB చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఈ పాట గురించి మాట్లాడుతూ.అతిఫ్ అస్లాం గతంలో PSL కోసం అద్భుతమైన గీతాలు అందించాడని,.
ఈ పాట స్టేడియంలలో అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.







