మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు.దర్శకులు ఎవరైనా సరే చిరంజీవికి కథ చెప్పాలి అంటే మాత్రం అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి.
చిరంజీవి కథ ఒప్పుకున్న తర్వాత ఆ సినిమా కథలో చాలావరకు మార్పులు చేర్పులు చేస్తారనే టాక్ అయితే ఉంది.చిరంజీవి అలాంటి మార్పులు చేర్పులు ఎందుకు చేస్తారు అంటే కథలో కాన్ఫ్లిక్ట్ అనేది కరెక్ట్ గా కుదరకపోతే మాత్రం ఆయన వేరే రైటర్స్ ను పెట్టి కథలో మార్పులు చేర్పులు చేయిస్తాడు.

ఆ మార్పులు చేర్పులను దర్శకుడు కూడా అంగీకరించాల్సిన అవసరమైతే ఉంది.అలాగైతేనే చిరంజీవి వాళ్ళతో సినిమా చేస్తాడు.లేకపోతే మాత్రం సినిమా చేసే ప్రసక్తే లేదు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి.మరి చిరంజీవి కథ విషయంలో( Movie Story ) ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు.
దర్శకులకు( Directors ) పూర్తి స్వేచ్చను ఇస్తే వాళ్ళు ఇంకా మంచిగా సినిమాలు చేసి ముందుకు తీసుకెళ్తారు కదా అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇంతకుముందు చిరంజీవి కొంతమంది దర్శకులను అలా నమ్మి ముందుకు సాగినప్పుడు ఆ దర్శకులు ఆ సినిమాలతో ఫ్లాప్ లను ఇచ్చారట.అందువల్ల చిరంజీవి కూడా కొంతవరకు సినిమా కథలో ఇన్వాల్వ్ అయితే మంచి ప్రాడక్ట్ అయితే బయటికి వచ్చేదనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి తన కథలో కొంత మార్పులు చేర్పులు చెబుతూ ఉంటాడనే విషయాలైతే వినపడుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఎవరు ఎలాంటి కథతో సినిమా చేసిన కూడా అల్టిమేట్ గా సక్సెస్ కోసమే సినిమాలు చేస్తూ ఉంటారు.
కాబట్టి చిరంజీవి కూడా సక్సెస్ ఫుల్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ దర్శకులకు కొన్ని సలహాలైతే ఇస్తూ ఉంటాడు అనేది వాస్తవం…మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ముందుకు సాగుతున్న దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా ముందుకు సాగుతారు లేకపోతే మాత్రం ఫ్లాప్ లను మూటగట్టుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది…
.