ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు( British general election ) ముగిశాయి.ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించి.
దాదాపు 14 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది.ముందస్తు అంచనాలు, సర్వే ఫలితాల్లో చెప్పినట్లుగానే భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ( Prime Minister Rishi Sunak )నేతృతవ్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది.
ఈ ఎన్నికల్లో పలువురు భారత సంతతికి చెందిన అభ్యర్ధులు కూడా కన్జర్వేటివ్, లేబర్ పార్టీల నుంచి తమ అదృష్టం పరీక్షించుకున్నారు.
ముఖ్యంగా తెలుగు మూలాలున్న ఇద్దరు వ్యక్తులు ఓటమి పాలయ్యారు.వారు ఉదయ్ నాగరాజు( Uday Nagaraju ) (లేబర్ పార్టీ), చంద్ర కన్నెగంటి ( Chandra kenganti )(కన్జర్వేటివ్).ముందుగా ఉదయ్ సంగతి చూస్తే.
నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ స్టానం నుంచి బరిలో దిగిన ఆయనపై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిచర్డ్ పుల్లర్( Richard Puller ) దాదాపు 19,981 ఓట్ల తేడాతో విజయం సాధించారు.నాగరాజుకు 14,567 ఓట్లు మాత్రమే పోలై రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు.బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు.
రచయితగా, అంతర్జాతీయ వక్తగా నాగరాజు గుర్తింపు తెచ్చుకున్నారు.దివంగత ప్రధాని , భారతరత్న పీవీ నరసింహారావుకు నాగరాజు సమీప బంధువు.
ఇక మరో వ్యక్తి చంద్ర కన్నెగంటి విషయానికి వస్తే.కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా స్ట్రోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన చంద్రపై లేబర్ పార్టీకి చెందిన గారెత్ స్నెల్ విజయం సాధించారు.చంద్రకు 6,221 ఓట్లు మాత్రమే పోలై మూడో స్థానంలో నిలిచారు.నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన ఆయన లండన్‌లో స్థిరపడ్డారు.వైద్యుడిగా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.స్ట్రోక్ ఆన్ ట్రెంట్ నగరంలో రెండు సార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్ గాను చంద్ర సేవలందించారు.