టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా చివరగా రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) ప్రేక్షకులను పలకరించారు.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో పాటు కోట్లల్లో కలెక్షన్స్ సాధించింది.
ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు చెర్రీ.
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో( Game Changer ) నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.దాంతో చెర్రీ అభిమానులు ఈ సినిమాపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ పై ( Shankar ) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ సినిమా విడుదల అవుతుంది అనుకున్న కొద్ది ఆలస్యం అవుతూ ఉండడంతో అభిమానులు తీవ్ర నిరాశ పడుతున్నారు.
అయితే ఇలాంటి సమయంలో గేమ్ ఛేంజర్ కంటే ముందే రామ్ చరణ్ బిగ్ స్క్రీన్ మీద సందడి చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యమవడానికి కారణం ఇండియన్-2( Indian 2 ) సినిమానే అన్న విషయం తెలిసిందే.అయితే నిజానికి ఇండియన్-2 మూవీనే డైరెక్టర్ శంకర్ ముందు స్టార్ట్ చేశాడు.కానీ కొన్ని వివాదాల కారణంగా ప్రొడక్షన్ కి బ్రేక్ పడింది.
దీంతో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాని మొదలుపెట్టాడు శంకర్.అయితే గేమ్ ఛేంజర్ కొంతభాగం షూట్ అయ్యాక అనుకోకుండా వివాదాలు సద్దుమణగడంతో శంకర్ మళ్ళీ ఇండియన్-2 మూవీతో బిజీ కావాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు అదే ఇండియన్-2 చరణ్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయనుందనీ తెలుస్తోంది.ఇండియన్-2 లో రామ్ చరణ్ అతిథి పాత్రలో మెరవనున్నాడట.కనిపించేది కాసేపే అయినప్పటికీ, అది ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ లా ఉంటుందట.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.కాగా ఈ నెల జూలై 12న ఇండియన్-2 విడుదల కానుంది.ఆరోజు చరణ్ గెస్ట్ రోల్ పై క్లారిటీ రానుంది.