చరణ్ కోసం చిరంజీవి త్యాగం చేస్తారా.. తండ్రి మనస్సు ఎంతైనా గొప్పదంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

 Chiranjeevi Sacrifice For Ram Charan Details, Chiraneevi, Ram Charan, Tollywood,-TeluguStop.com

అందులో భాగంగానే చివరగా భోళా శంకర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మూవీలో( Vishwambhara Movie ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.కాగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Telugu Chiraneevi, Chiranjeevi, Shankar, Game Changer, Indian, Pushpa, Ram Chara

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది.దీంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదలవుతుందని మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు.అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది.రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ( Game Changer ) ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ఎన్నో రకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తోంది.ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా విడుదల కావడానికి ఇండియన్ 2( Indian 2 ) నే కారణం అన్న విషయం మనందరికీ తెలిసిందే.

Telugu Chiraneevi, Chiranjeevi, Shankar, Game Changer, Indian, Pushpa, Ram Chara

ఇంకా రెండు వారాల షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది.రిలీజ్ డేట్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు.అక్టోబర్ చివరిలో లేదా డిసెంబర్ చివరిలో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి.అయితే అక్టోబర్ లో ఈ సినిమా వచ్చే అవకాశం లేదని, డిసెంబర్ లో కూడా అనుమానమేనని అంటున్నారు.

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చూపు సంక్రాంతిపై పడినట్లు సమాచారం.అయితే డిసెంబర్లో ఈ సినిమా విడుదల అయితే కలెక్షన్ లు అంతగా కలిసి రాకపోవచ్చు.కాబట్టి గేమ్ చేంజర్ మూవీ ని ఎలా అయినా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.డిసెంబర్ 6న పుష్ప-2,( Pushpa 2 ) జనవరి 10న విశ్వంభర ఉన్నాయి.

ఈ రెండు భారీ సినిమాల మధ్యలో గేమ్ ఛేంజర్ విడుదలైతే ఖచ్చితంగా కల్లెక్షన్లపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.అందుకే ఈ సినిమాకి సంక్రాంతికి తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.

మరోవైపు చిరంజీవి సైతం తన కుమారుడు కోసం సంక్రాంతి సీజన్ ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారట.అదే జరిగితే విశ్వంభర జనవరి చివరికి లేదా మార్చికి వాయిదా పడే అవకాశముంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube