చరణ్ కోసం చిరంజీవి త్యాగం చేస్తారా.. తండ్రి మనస్సు ఎంతైనా గొప్పదంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

అందులో భాగంగానే చివరగా భోళా శంకర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మూవీలో( Vishwambhara Movie ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

కాగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

"""/" / ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది.దీంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదలవుతుందని మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు.

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ( Game Changer ) ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ఎన్నో రకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తోంది.ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా విడుదల కావడానికి ఇండియన్ 2( Indian 2 ) నే కారణం అన్న విషయం మనందరికీ తెలిసిందే.

"""/" / ఇంకా రెండు వారాల షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది.

రిలీజ్ డేట్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు.అక్టోబర్ చివరిలో లేదా డిసెంబర్ చివరిలో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి.

అయితే అక్టోబర్ లో ఈ సినిమా వచ్చే అవకాశం లేదని, డిసెంబర్ లో కూడా అనుమానమేనని అంటున్నారు.

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చూపు సంక్రాంతిపై పడినట్లు సమాచారం.అయితే డిసెంబర్లో ఈ సినిమా విడుదల అయితే కలెక్షన్ లు అంతగా కలిసి రాకపోవచ్చు.

కాబట్టి గేమ్ చేంజర్ మూవీ ని ఎలా అయినా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 6న పుష్ప-2,( Pushpa 2 ) జనవరి 10న విశ్వంభర ఉన్నాయి.

ఈ రెండు భారీ సినిమాల మధ్యలో గేమ్ ఛేంజర్ విడుదలైతే ఖచ్చితంగా కల్లెక్షన్లపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

అందుకే ఈ సినిమాకి సంక్రాంతికి తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.మరోవైపు చిరంజీవి సైతం తన కుమారుడు కోసం సంక్రాంతి సీజన్ ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారట.

అదే జరిగితే విశ్వంభర జనవరి చివరికి లేదా మార్చికి వాయిదా పడే అవకాశముంది.

ఈ వరాహం సాక్షాత్తు విష్ణువు రూపమేనా.. ఆనందంగా పాలిచ్చిన గోమాత..?