వైరల్: పెద్ద సమస్యను పరిష్కరించిన గేద.. ఎలా అంటే..

సాధారణంగా మనం రెండు వర్గాల మధ్య గొడవల పరిష్కారానికి ఊర్లలో పంచాయతీలు పెట్టి తీర్పును ఇవ్వడం చూస్తూనే ఉంటాం.ఇది ఇలా ఉండగా.

 How A Buffalo Helped Uttar Pradesh Police Settle A Village Dispute Details, Buff-TeluguStop.com

తాజాగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన పంచాయితీ చివరకు ఒక గేద( Buffalo ) పరిష్కారం చూపించింది అంటే నమ్మండి.అవును మీరు విన్నది నిజమే.

ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవను( Dispute ) ఒక గేద పరిష్కరించి అందరూ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

Telugu Buffalo, Buffalo Settles, Hanuman, Nandalal Saroj, Ownership, Pratapgarh,

ఉత్తరప్రదేశ్ లోని( Uttar Pradesh ) ప్రతాప్‌ గఢ్‌ జిల్లా అక్షరాంపూర్‌ గ్రామంలో నందలాల్ సరోజ్ కు( Nandalal Saroj ) చెందిన ఒక గేద గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు.ఆ తర్వాత ఆ గేద పక్కనే ఉన్న పూరే హరికేశ్‌ గ్రామానికి చేరింది.ఆ ఊరికి చెందిన హనుమాన్‌ ( Hanuman ) దాన్ని కట్టేశాడు.ఇక నందలాల్ ఆ గేదను ఎంత వెతికినా కూడా ఆచూకీ కనిపించలేదు.కానీ., చివరకు హనుమాన్ వద్ద ఉందని నిజం తెలుసుకున్న అతడు అక్కడికి వెళ్లి హనుమాన్ ను అడగగా అతను తన గేదనేనని వాదించడం మొదలుపెట్టాడు.

దీంతో నందలాల్ కు ఏం చేయాలో అర్థం కాక.నందలాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి మరి పంచాయతీకి పిలిపించాడు.

Telugu Buffalo, Buffalo Settles, Hanuman, Nandalal Saroj, Ownership, Pratapgarh,

ఇక ఈ పంచాయతీలో ఆ గేదె నాదంటే నాదని ఇద్దరూ కూడా గొడవపడ్డారు.ఇక ఈ తరుణంలో స్టేషన్ ఆఫీసర్ ఏం చేయాలో అర్థం కాక ఒక నిర్ణయానికి వచ్చాడు.అది ఏమిటంటే., ఆ గేదెను రెండు ఊర్ల మధ్య విడిచిపెడితే ఆ గేదె ఎవరి ఇంటి వద్దకు వెళ్తే వారే అసలైన యజమాని అని స్పష్టంగా తెలియచేశారు.

దీనితో ఇరువు వర్గాలు సమ్మతమే అని చెప్పగా.దీంతో ఆ గేదెను తీసుకొచ్చి రెండు ఊర్ల మధ్య విడిచిపెట్టారు.ఆ తర్వాత ఆ గేద నేరుగా నందలాల్ ఇంటికి వెళ్లిపోయింది.దీంతో హనుమాన్ ను పోలీసులు, గ్రామస్తులు మందలించి ఆ గేదె తన యజమానిని ఎంచుకున్నది అంటూ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube