ఉత్తరప్రదేశ్ రాష్ట్రం,( Uttar Pradesh ) హార్డోయ్ జిల్లా, ఘంటాఘర్ రోడ్డులోని( Ghanta Ghar Road ) ఒక పెట్రోల్ పంపు( Petrol Pump ) వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.ఇక్కడ నిలిపి ఉంచిన బస్సు,( Bus ) డ్రైవర్ లేకుండానే ఒక్కసారిగా కదిలింది.
అంతేకాదు ఒక పెట్రోల్ బంక్ ఉద్యోగిని తొక్కేసింది.ఈ ఘటనలో సదరు ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ బస్సు పెట్రోల్ పంపు స్టేషన్ లో బైక్ టైర్‌కు గాలి పడుపుతున్న ఉద్యోగిని ఢీకొని, అతడిపై నుంచి దాటి, ఫుట్‌పాత్‌పై నిలిపి ఉన్న మరొక బస్సును ఢీకొట్టింది.ఈ ఊహించని సంఘటన కారణంగా గందరగోళం చెలరేగింది.
గాయపడిన ఉద్యోగిని చికిత్స కోసం లక్నోకు తరలించారు.
అక్కడి ఉద్యోగులు తెలిపిన ప్రకారం, బుధవారం (జులై 3) రాత్రి టాండన్ పెట్రోల్ పంపు వద్దకు డీజిల్ రీఫిల్ చేయించుకోవడానికి ఒక బస్సు వచ్చింది.
డీజిల్ పోస్తున్న సమయంలో బస్సు వింతగా ప్రవర్తించింది.డ్రైవర్( Driver ) బస్సును పెట్రోల్ పంపు ప్రాంగణంలో ఆపి, చక్రాల ముందు ఇటుకలు పెట్టాడు.
గురువారం (జులై 4) ఉదయం, సుమారు 9 గంటలకు, ఆ బస్సు ఒక్కసారిగా స్వయంగా కదలడం ప్రారంభించింది.మధోగాంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దకోలికి చెందిన 36 ఏళ్ల ఉద్యోగి తేజ్‌పాల్ (36)( Tejpal ) టైర్లకు గాలి నింపుతున్న సమయంలో ఆ బస్సు అతనిపై దూసుకువెళ్లి, ఫుట్‌పాత్‌పై నిలిపి ఉన్న మరొక బస్సును ఢీకొట్టింది.ఈ ఘటన పెట్రోల్ పంపులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బస్సు ప్రమాదంలో గాయపడిన తేజ్‌పాల్‌ను పెట్రోల్ బంక్ సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అనంతరం, ఆయనను లక్నోకు రిఫర్ చేశారు.పోలీసులు ఘటనాస్థలం నుంచి బస్సును తరలించారు.సిటీ ఇన్‌స్పెక్టర్ సంజయ్ పాండే బస్సు పాడైపోయిన స్థితిలో పార్క్ చేశారని తెలిపారు.చక్రాల ముందు ఉంచిన ఇటుకలు తొలగించడం, ప్రాంతం వాలు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.