కేంద్రాన్ని ఒప్పించిన బాబు ... అమరావతికి మహర్దశ

ఎట్టకేలకు అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టలేదు టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.( CM Chandrababu Naidu )  అమరావతి కి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తూనే వస్తున్నారు.2014లో టిడిపి( TDP ) అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా,  అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం , పూర్తిస్థాయిలో రాజధానికి కావలసిన అన్ని హంగులను సమకూర్చుతూ పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాలని భావించారు .ఇంతలోనే 2019 ఎన్నికలు రావడం,  ఆ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓటమి చెందడం , వైసిపి అధికారంలోకి రావడంతో , అమరావతి లో( Amaravati ) అభివృద్ధి పనులకు పులిస్టాప్ పడింది.

 Cm Chandrababu Who Convinced The Center For The Development Of Amaravati Details-TeluguStop.com
Telugu Amaravati, Amravati, Ap Amaravathi, Central, Cm Chandrababu, Jagan, Prime

గత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చి,  విశాఖ ను పరిపాలన రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించడంతో,  అమరావతిలో అభివృద్ధి కుంటుపడింది.ప్రస్తుతం టిడిపి అధికారంలో ఉండడం,  కేంద్రంలో బిజెపికి సరైన మెజార్టీ లేకపోవడంతో,  ఎన్డీఏలో( NDA ) టిడిపి కీలక భాగస్వామి గా మారింది.  దీంతో ఏపీ అభివృద్ధికి సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగానే స్పందిస్తూ వస్తుంది.

  ఇక ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు అమరావతి లో అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర పెద్దలను ఒప్పించారు .ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది.  ముఖ్యంగా అన్ని ప్రాంతాల నుంచి అమరావతిని సులువుగా చేరుకునేందుకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది .హైదరాబాద్ నుంచి అమరావతికి ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Telugu Amaravati, Amravati, Ap Amaravathi, Central, Cm Chandrababu, Jagan, Prime

ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన స్థాయి సంఘంతో పాటు,  ప్రధాని కార్యాలయం ఆమోదం పొందిన తర్వాత ఇవన్నీ ప్రారంభమవుతాయని చెబుతున్నారు.  అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం భూసేకరణతో పాటు , మొత్తం 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించింది .దీంతో విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు ఆమోదం తెలిపింది.  దీనివల్ల 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

  అలాగే రాయలసీమ నుంచి రాజధాని అమరావతి కి కనెక్టివిటీ పెంచేలా జాతీయ రహదారిని నిర్మించనున్నారు .సత్యసాయి జిల్లాలోని కోడికొండ నుంచి మెదరమెట్లకు కలుపుతూ,  తర్వాత అమరావతికి కొనసాగిస్తూ చేపట్టిన 90 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే క కూడా కేంద్రం నుంచి అనుమతి లభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube