కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద ఇటీవలి కాలంలో తరచుగా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా ఖలిస్తాన్ ( Khalistan )వేర్పాటువాదులు, సంస్థలు భారతీయ మిషన్‌లను టార్గెట్ చేస్తున్నారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్ సమయంలో దౌత్య సిబ్బందిపై బెదిరింపుల పర్వం కొనసాగింది.కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టడానికి ప్రయత్నించడం వంటి ఘటనలు జరిగాయి.
కెనడాలోని భారతీయ దౌత్య కార్యాలయాల వద్ద గడిచిన ఏడాది కాలంలో దాదాపు 20కి పైగా నిరసన ప్రదర్శనలు జరిగాయని అంచనా .

తాజాగా గురువారం ఖలిస్తాన్ మద్ధతుదారులు .కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మకు వ్యతిరేకంగా ‘పికెటింగ్’( Picketing ) పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) పిలుపు మేరకు ఈ ఆందోళన జరిగినట్లుగా తెలుస్తోంది.
నిజ్జర్ హత్య తర్వాత గతేడాది జూలై 8, 2023న తొలిసారిగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులను ఖలిస్తాన్ మద్ధతుదారులు టార్గెట్ చేశారు.ఈ నిరసనలకు సంబంధించి.
ముందుగానే తెలుసుకున్న భారత విదేశాంగ శాఖ.గ్లోబల్ అఫైర్స్ కెనడాకు (జీఏసీ) సమాచారం అందించి భద్రతను కోరేది.

గురువారం కెనడా రాజధాని ఒట్టావాలోని హైకమీషన్ కార్యాలయం ( High Commission in Ottawa )ముందు నిరసనకారులు గుమిగూడి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దాదాపు నాలుగున్నర గంటల పాటు వారు అక్కడే ఉన్నారు.అయితే కెనడా ప్రభుత్వం చేసిన భద్రతా ఏర్పాట్లు సరిపోలేదని ఓ సీనియర్ భారతీయ అధికారి అన్నారు.గతేడాది జూలైలో ప్రారంభమైన నిరసనలకు ముందు ఆన్‌లైన్‌లో కిల్ ఇండియా అనే పదాలతో హైకమీషనర్.
టొరంటో, వాంకోవర్‌లోని భారత కాన్సులర్ జనరల్ చిత్రాలను కలిగి ఉన్న పోస్టర్‌లను వారు వైరల్ చేసేవారు.అలాగే భారతీయ అధికారులు హాజరైన దేవాలయాలు, ఇతర వేదికలను కూడా ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయి.