కన్జర్వేటివ్‌ల కంచుకోటను బద్ధలుకొట్టి, యూకేకు ప్రధానిగా .. ఎవరీ కీర్ స్టార్మర్..?

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్( Prime Minister Rishi Sunak ) సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.దాదాపు 14 ఏళ్లుగా అధికారం కోసం పోరాడుతున్న లేబర్ పార్టీని ఎట్టకేలకు విజయం వరించింది.

 Who Is Keir Starmer, The Next British Prime Minister , British Prime Minister,-TeluguStop.com

దీంతో లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ యూకేకు ప్రధానిగా పగ్గాలు అందుకోనున్నారు.ఈ నేపథ్యంలో ఆయన పేరు మారుమోగిపోతోంది.

ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితం ఇతర నేపథ్యాల గురించి నెటిజన్లు ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు.

Telugu British Prime, Public Wales, Queenelizabeth, Sir Keir, Keir-Telugu Top Po

1962 సెప్టెంబర్ 2న సౌత్‌వార్క్‌లో జన్మించిన సర్ కీర్ స్టార్మర్( Sir Keir Starmer ) తల్లి ఓ ఫ్యాక్టరీలో కూలీ.ఆర్ధిక ఇబ్బందులతో కష్టాలు పడుతూనే పట్టుదలతో స్టార్మర్ చదువును కొనసాగించారు.యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, సెయింట్ ఎడ్మండ్ హాల్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల్లో చదువుకున్నారు.

వారి కుటుంబంలో తొలిసారి యూనివర్సిటీకి వెళ్లింది స్టార్మరే.లా చదివిన ఆయన 2003లో నార్తర్న్ ఐర్లాండ్ పోలీస్ విభాగానికి మానవ హక్కుల సలహాదారుగా సేవలందించారు.

అనంతరం లేబర్ పార్టీ నేత, ప్రధాని గార్డెన్ బ్రౌన్ ( Prime Minister Gordon Brown )పాలనా కాలంలో ఇంగ్లాండ్, వేల్స్‌కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ( Public prosecutions for Wales )డైరెక్టర్‌గా పనిచేశారు.ఆ సమయంలో నిధులను దుర్వినియోగం చేసే ఎంపీలతో పాటు ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడిన జర్నలిస్టులకు శిక్షను వేయించారు.

Telugu British Prime, Public Wales, Queenelizabeth, Sir Keir, Keir-Telugu Top Po

న్యాయవాదిగా అందించిన సేవలకు గాను 2014లో దివంగత బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజెబెత్ 2( Queen Elizabeth 2 of Britain ) నుంచి నైట్‌హుడ్ అందుకున్నారు.2015 ఎన్నికల్లో రాజకీయాల్లోకి దిగిన స్టార్మర్ ఎంపీగా పోటీ చేశారు.అయితే ఆ సమయంలోనే ఆయన తల్లి కన్నుమూయగా.బాధను భరిస్తూనే ప్రచారంలో పాల్గొన్నారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయంతో లేబర్ పార్టీ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది.ఈ ఓటమి బాధ నుంచి నేతలు, కార్యకర్తలను బయటికి తీసుకొచ్చి ధైర్యం నూరిపోసి తాజా ఎన్నికలకు సిద్ధం చేశారు.

లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారంటూ రిషి సునాక్ సహా కన్జర్వేటివ్ పార్టీ నేతలు చేసిన ప్రచారాన్ని స్టార్మర్ తిప్పికొట్టారు.అధికార పార్టీలో ఉన్న అస్థిరతను జనంలోకి తీసుకెళ్లి లేబర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube