సినిమా ఇండస్ట్రీలో హీరో అయితే ఆరడుగుల ఆజానుబాహుడులా, హీరోయిన్ అయితే ఆకాశం నుండి దిగివచ్చిన దేవకన్యలా ఉంటే ప్రేక్షకులు వారిని అభిమానించడమే కాదు వారిని గుండెల్లో పెట్టుకొని గుళ్ళు కూడా కడతారు.అయితే సినిమాలో మనకి కనిపిస్తుంది అంత మాయే అని ఎక్కువమందికి తెలియదు అక్కడ కనిపించేదంతా రంగుల ప్రపంచమని దాని వెనకాల ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉంటాయని కూడా తెలియని వారు లేకపోలేదు.
మరీ ముఖ్యంగా మనకు తెరమీద కనిపించే అందాల భామలు మనల్ని వారి అందచందాలతో కట్టిపడేస్తారు.ఇప్పుడున్న డైరెక్టర్లు అయితే హీరోయిన్లను అవసరానికి మించి గ్లామరస్ గా చూపిస్తున్నారు.
సో, వారు వేసుకునే బట్టల దగ్గర నుండి వాళ్ళు తినే ఫుడ్ వరకు ఎన్నో జాగ్రత్తలు వహించాలి.బాగా టైం కి నిద్రపోయి వర్కౌట్స్ చేస్తూ సరైన ఫిజిక్ కూడా మెయింటైన్ చేయాలి.
వీరి ఫేసు మీద గాని వారి ఒంటి మీద గాని చిన్న మచ్చ కూడా రాకుండా చూసుకోవాలి అప్పుడే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి.లేదంటే చాల చాల కష్టం.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కొంతమంది స్టార్ హీరోయిన్స్ కి అద్ధాంతరంగా కొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి.అయితే వాటిని వాళ్ళు ఎలా అధిగమించారో ఇప్పుడు చూద్దాం.

ఈ లిస్ట్ లో మనం ముందుగా మాట్లాడుకోబోయే హీరోయిన్ స్నేహ ఉల్లాల్.ఈమె ఒక హిందీ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.అక్కడ నుండి ఇటు తెలుగు తమిళ్ సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకొని అతి తక్కువ టైం లో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
కరెంట్, ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ సాధించిన స్నేహ ఉల్లాల్ సడన్ గా కనిపించకుండా పోయింది.దానికి కారణాలు కూడా లేకపోలేదు.ఈమెకి రక్తానికి సంబంధించిన ఏదో సమస్య ఉందట.దాని వలన షూటింగ్ స్పాట్ లో కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయేదట.
అందువలనే త్వరత్వరగా ఆమె కమిట్ అయినా సినిమాలను కంప్లీట్ చేసేసి ట్రీట్మెంట్ కి వెళ్లిందట.ఇక అక్కడ లేట్ అవ్వడం వలన మొత్తం ఇండస్ట్రీకి ప్రెసెంట్ దూరమయ్యింది.

ఇక ఈ లిస్ట్ లో సెకండ్ హీరోయిన్ వచ్చేసి మనందరి ఫేవరేట్ సమంతా..ఈమె సినిమా అంటే చాలు దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేయడానికైనా సై అంటుంది.అంతేకాదు ఆమెకిచ్చిన పాత్రకు తగ్గట్టుగా బాగానే నటిస్తుంది.అందుకే సమంతా అంటే అందరూ బాగా ఇష్టపడతారు.ఇక అసలు విషయానికి వస్తే సమంత కి నడుము దగ్గర ఒక స్కిన్ ప్రాబ్లమ్ ఉందట.ఫేసు మీద అయితే మేకప్ తో కవర్ చేయొచ్చు కానీ నడుముదగ్గర కావడంతో ఎలా మేనేజ్ చేయాలో అర్ధంకాక గ్లామర్ డ్రెస్సులు వేసేటప్పుడు చాల ఇబ్బంది పడుతుందట సమంత.
ఇప్పటికే ఆమె ఫేసుకి సంబంధించిన ఒక సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు ఉన్నాయి.
ఇక ఈ లిస్ట్ లో కుర్రాళ్ళ కలల రాకుమారి నయనతార కూడా ఉంది.
ఈమె కూడా సమంత లాగే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుందట.దీనికోసం ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం మందులు, ఇలా ఎన్నెన్నో వాడిన ఫలితం కనిపించట్లేదట.
అయితే ఈ బాధ ఎంతలా తనని బాధిస్తున్న తన అభిమానుల కోసం నటిస్తూనే ఉంటానని చెప్తోంది నయనతార!
.