టాలీవుడ్ ( Tollywood )లో ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కమీడియన్ గా మారి ఎన్నో వందల సినిమాల్లో నటించిన సుధాకర్ ( Comedian sudhakar )మనందరికి తెలిసిన నటుడే.ఈ తరం వారికి ఎక్కువగా పరిచయం లేకపోయినా ఒక తరం వెనక్కి వెళితే సుధాకర్ కామెడీ కోసమే సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్ళిన వారు ఎంతోమంది ఉండేవారు.
అంతలా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సుధాకర్ ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో( health problems ) చావు బ్రతుకుల వరకు వెళ్లి ప్రస్తుతం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు.ఆయన యూట్యూబ్ ఛానల్స్ కి అనేక ఇంటర్వ్యూస్ ఇస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే.
ఇక సుధాకర్ ఆర్థిక పరిస్థితులు కూడా బాగోలేవు.

ఆఖరికి తన కొడుకుని కూడా హీరో చెయ్యాలి అనుకున్న ఇండస్ట్రీలో సపోర్ట్ చేసేవారు లేకపోవడంతో ఆయన అనుకున్న పని జరగడం లేదు.ఎంతో బ్యాగ్రౌండ్ ఉంటే తప్ప ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం కష్టం అయిపోయింది.సుధాకర్ ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగుండే ఉండి ఉంటే తానే నిర్మాతగా మారి కొడుకుని హీరోగా పెట్టి సినిమా చేసేవాడు.
కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు కనీసం ఏదైనా హీరో సినిమాలో అవకాశం రావడం కూడా కష్టంగా మారింది.ఇక ఒకానొక దశలో సుధాకర్ కోమాలోకి కూడా వెళ్లి చాలా రోజుల పాటు ఆరోగ్య ఇబ్బందులు పడ్డారు.
ఆయన ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఎలాంటి పరిస్థితి ఉన్న ఎంత కష్టమైనా సరే తాను ఫోన్ చేస్తే ఇండస్ట్రీలో లిఫ్ట్ చేసే వారు ముగ్గురు నలుగురు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.

వాళ్లు మరెవరో కాదు తన ప్రాణ మిత్రుడు చిరంజీవి( Chiranjeevi ), హీరో జగపతి బాబు, ఆర్టిస్టు చిన్న, తనికెళ్ల భరణి ( Hero Jagapathi Babu, Artist Chinna, Tanikella Bharani )అంటూ చెప్పకచ్చారు కమెడియన్ సుధాకర్.ఈ ముగ్గురు నలుగురు నాకు ఎప్పుడు విలువ ఇస్తారని నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా వారు తనతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటారని ఏ రాత్రి ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుని తనకు కావాల్సిన సహాయం చేస్తారు అంటూ వీరే తన ప్రాణ మిత్రులు అంటూ సుధాకర్ చెప్పడం విశేషం.ఇప్పటికీ తనకు అవసరం ఉంటే అడగతాను కానీ అంత ఆ అవసరమైతే పడటం లేదని ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందని కానీ తన కొడుకుని నటుడుగా చూడాలని తన కోరిక నెరవేరుతుందా లేదా అనే బాధ మాత్రం ఉండిపోయింది అంటూ చెబుతున్నారు.