రిస్క్ లేని ఏకైక హీరో.. లార్జర్ దాన్ లైఫ్ పాత్రలకు ఆ ఒక్కడే ఛాయస్

కల్కి సినిమా ( Kalki movie )ప్రపంచం కొనసాగుతుంది.1000 కోట్లకు దిశగా ప్రస్తుతం ఈ సినిమా పరుగులు పెడుతుంది.ఇంకా పెద్ద మొత్తం వసూల్లను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.మరి కల్కి సినిమాకు ఉన్న ఏకైక ఆప్షన్ ప్రభాస్ మాత్రమే అంటాడు నాగ్ అశ్విన్( Nag Ashwin ).ఈ పాత్రను ప్రభాస్ తప్ప మరెవరు పోషించలేరా అంటే ఖచ్చితంగా పోషించలేరు.ప్రభాస్ ను మించి చాలామంది అద్భుతంగా నటించే నటులు ఉండొచ్చు.కానీ ఇండస్ట్రీలో ఎవరైనా రిస్క్ తీసుకోవాలి అంటే అది ప్రభాస్( Prabhas ) తో అయితే తప్ప మరో హీరోతో సాధ్యం కాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి.

 All Directors One And Only Option Prabhas , Kalki Movie, Nag Ashwin, Prabhas, To-TeluguStop.com

ఇదే విషయం ప్రస్తుతం నాగ్ అశ్విన్ సైతం కన్ఫర్మ్ చేస్తున్నాడు.

Telugu Directors, Kalki, Nag Ashwin, Prabhas, Tollywood-Telugu Top Posts

ఎందుకు ప్రభాస్ మాత్రమే మీ ఆప్షన్ గా ఉన్నాడు అని అడిగితే ప్రభాస్ ఐతేనే రిస్క్ ఉండదు.ఎంత పెద్ద పాత్ర అయినా చేసి ప్రభాస్తో నటింపజేయొచ్చు.ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) లో ఉన్న ఏకైక ఎక్స్పరిమెంటల్ హీరో అతడు మాత్రమే ఎలాంటి ఎక్స్పరిమెంట్ చేసినా తాను సిద్ధంగా ఉంటాడు.

అలాగే తన అభిమానులు కూడా అతనిని చూడటానికి అలాగే ఇష్టపడతారు కూడా.ప్రభాస్ కోసం ఎంత పెద్ద బడ్జెట్ అయినా పెట్టొచ్చు.సినిమా ప్లాప్ అయినా సరే పెట్టిన బడ్జెట్ రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తుంది.అంతలా ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఎందుకు ఫ్లాప్ అయిందో అని తెలుసుకోవడానికి అభిమానులు వెళ్లి థియేటర్లో సినిమా చూస్తారు.

Telugu Directors, Kalki, Nag Ashwin, Prabhas, Tollywood-Telugu Top Posts

ఒక లార్జర్ దాన్ లైఫ్ పాత్ర పోషించాలి అంటే ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే ఇప్పుడు అందరి డైరెక్టర్ కి ఉన్న ఏకైక ఆప్షన్ ప్రభాస్ మాత్రమే.పాత్రలను కాదు, కథను కాదు ప్రభాస్ ను నమ్ముకొని సినిమా తీయచ్చు.అంతలా డెడికేషన్ చూపిస్తాడు.

సినిమా కోసం కష్టపడతాడు.బాడీని, మనసుని, టైం ని దేనినైనా సరే వదిలేసుకోవడానికి ఇష్టపడతాడు.

అలా ఇండియాలో మరో హీరో ఎవరైనా ఉన్నారో చూపించండి తనతోనే సినిమా తీస్తాను అంటున్నాడు నాగ్ అశ్విన్.ఇప్పుడు తనకు మాత్రమే కాదు రాజమౌళికి, ప్రశాంత్ నీల్ కి, సందీప్ రెడ్డి వంగా కి, టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్స్ అందరికి ప్రభాస్ మాత్రమే ఏకైక ఆప్షన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube