పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి హీరోగా రాజ్ తరుణ్ ( Raj Tarun )మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడర సామి అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

 New Troubles To Hero Raj Tarun Career Details Inside Goes Viral In Social Media-TeluguStop.com

రాజ్ తరుణ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను కచ్చితంగా అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే రాజ్ తరుణ్ ఊహించని విధంగా ఒక కేసులో చిక్కుకున్నారు.

లావణ్య( Lavanya ) అనే యువతి రాజ్ తరుణ్ తో గత 11 సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నానని ఆమె పేర్కొన్నారు.గతంలోనే గుడిలో నాకు, రాజ్ తరుణ్ కు పెళ్లైందని అధికారికంగా మరోసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక హీరోయిన్ తో రిలేషన్ షిప్ వల్ల మోసం చేశాడని లావణ్య వెల్లడించారు.

ఈ కామెంట్లపై రాజ్ తరుణ్ సైతం రియాక్ట్ అయ్యారు.నార్సింగి పోలీస్ స్టేషన్ ( Narsinghi Police Station )లో యువతి ఫిర్యాదు చేసింది.

రాజ్ తరుణ్ యువతితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.వేరే అబ్బాయితో లావణ్య రిలేషన్ షిప్ లో ఉందని నేను లైఫ్ లో పెళ్లే చేసుకోకూడదు అనుకుంటున్నానని రాజ్ తరుణ్ వెల్లడించారు.2017 వరకు ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్నాను కానీ ఆ రిలేషన్ షిప్ ఇప్పుడు శారీరకమైన రిలేషన్ షిప్ కాదని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు రిలేషన్ ఉందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు.

ఇంట్లో ఉంటూనే లావణ్య టార్చర్ చేసిందని ఆ టార్చర్ ను నేను బయట చెప్పుకోలేదని రాజ్ తరుణ్ వెల్లడించారు.లావణ్యను నేను మోసం చేసిన మాట అవాస్తవం అని ఆయన పేర్కొన్నారు.పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజ్ తరుణ్ కు కొత్త ఆఫర్లు సులువు కాదని ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube