కళ్యాణ్ రామ్( Kalyan Ram ) హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వచ్చిన బిబిసారా సినిమా( Bimbisara ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక బింబిసార కు సీక్వెల్ ను తీయాలనే ఉద్దేశ్యం తో గత కొద్దిరోజుల కళ్యాణ్ రామ్ ప్రణాళికలను రూపొందిస్తున్నాడు.
అయితే వశిష్ట మాత్రం చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నాడు.ఇక ఆ సినిమా ల్ను పూర్తి చేయడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.
కాబట్టి ఈలోపే కళ్యాణ్ రామ్ ఈ సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే రొమాంటిక్ సినిమాని తీసిన అనిల్ ను దర్శకుడుగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరి ఈ సినిమా బింబిసారా లెవెల్లోనే ఆడుతుందా లేదంటే ప్లాప్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇక దర్శకుడు అనిల్ కి కూడా ఒక సినిమాను తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది.కాబట్టి ఆయన కూడా ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలను చేసే ఉద్దేశ్యం లో ఉన్నాడు.అందుకే వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా దేవర సినిమా( Devara movie ) కూడా వస్తుంది.మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటే కళ్యాణ్ రామ్ కి కాసుల వర్షం అయితే కురుస్తుంది.లేకపోతే మాత్రం మరింత ఇబ్బందుల్లో పడే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఇప్పటికైనా ప్రొడ్యూసర్గా చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అందువల్ల ఫైనాన్షియల్ గా కొంచెం డిస్టర్బ్ అయిన కళ్యాణ్ రామ్ దేవర సినిమా సక్సెస్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్స్ ను అందుకుంటాడు.