చంద్రబాబుపై సీబీఐ విచారణ .. హైకోర్టులో పిటిషన్ 

టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై( CM Chandrababu Naidu ) సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో( AP High Court ) పిటిషన్ దాఖలు అయింది.గతంలో చంద్రబాబుపై నమోదైన ఆరు కేసులకు సంబంధించి వెంటనే సీబీఐ విచారణ( CBI Inquiry ) జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది .

 Pil In Ap High Court Against Cm Chandrababu Naidu Details, Cbi, Chandrababu, Cbn-TeluguStop.com

మొత్తం 114 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు అయింది.  చంద్రబాబుపై దాఖలైన కేసులు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం ,( AP Skill Development Scam ) మద్యం అవకతవకలు,  ఇసుక అక్రమాలు,  అసైన్డ్ భూములు , ఏపీ ఫైబర్ నెట్,  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను పేర్కొంటూ,  వీటిపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. 

Telugu Amravati Road, Ap Skill Scam, Atchenna, Balgangadhar, Chandrababu, Lokesh

స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్( Balagangadhar Tilak ) 2014 నుంచి 19 వరకు టిడిపి హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై చంద్రబాబుతో పాటు,  అప్పటి మంత్రులుగా ఉన్న అచ్చెన్న నాయుడు,( Atchennaidu )  నారాయణ,( Narayana )  లోకేష్ ,కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా,  చింతమనేని ప్రభాకర్ తో పాటు , మొత్తం 114 మందిని ప్రశ్నించాల్సిందిగా కోరుతూ .వారిని ప్రతివాదులుగా చేర్చారు పిటీషనర్ బాలగంగాధర్ తిలక్. అసలు ఈ పిటీషన్ ను  ఇప్పుడు దాఖలు చేయడానికి కారణాలను పిటిషనర్ వివరించారు.

Telugu Amravati Road, Ap Skill Scam, Atchenna, Balgangadhar, Chandrababu, Lokesh

ప్రస్తుతం ఏపీలో టిడిపి,  జనసేన,  బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులంతా ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వల్ల ఇలాంటి కేసులపై ప్రభావం పడుతుందని,  డీజీపీ స్థాయి అధికారులు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని , అందుకే నిష్పాక్షిక పారదర్శకమైన దర్యాప్తు కోసం కేసుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారట.  దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది.బాల గంగాధర్ తిలక్ పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తుందా ?  చంద్రబాబుపై సీబీఐ విచారణకు అదేశిస్తుందా అనేది రాజకీయంగా  చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube