చంద్రబాబుపై సీబీఐ విచారణ .. హైకోర్టులో పిటిషన్ 

టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై( CM Chandrababu Naidu ) సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో( AP High Court ) పిటిషన్ దాఖలు అయింది.

గతంలో చంద్రబాబుపై నమోదైన ఆరు కేసులకు సంబంధించి వెంటనే సీబీఐ విచారణ( CBI Inquiry ) జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది .

మొత్తం 114 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు అయింది.  చంద్రబాబుపై దాఖలైన కేసులు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం ,( AP Skill Development Scam ) మద్యం అవకతవకలు,  ఇసుక అక్రమాలు,  అసైన్డ్ భూములు , ఏపీ ఫైబర్ నెట్,  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను పేర్కొంటూ,  వీటిపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు.

  """/" / స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్( Balagangadhar Tilak ) 2014 నుంచి 19 వరకు టిడిపి హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై చంద్రబాబుతో పాటు,  అప్పటి మంత్రులుగా ఉన్న అచ్చెన్న నాయుడు,( Atchennaidu )  నారాయణ,( Narayana )  లోకేష్ ,కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా,  చింతమనేని ప్రభాకర్ తో పాటు , మొత్తం 114 మందిని ప్రశ్నించాల్సిందిగా కోరుతూ .

వారిని ప్రతివాదులుగా చేర్చారు పిటీషనర్ బాలగంగాధర్ తిలక్.అసలు ఈ పిటీషన్ ను  ఇప్పుడు దాఖలు చేయడానికి కారణాలను పిటిషనర్ వివరించారు.

"""/" / ప్రస్తుతం ఏపీలో టిడిపి,  జనసేన,  బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులంతా ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వల్ల ఇలాంటి కేసులపై ప్రభావం పడుతుందని,  డీజీపీ స్థాయి అధికారులు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని , అందుకే నిష్పాక్షిక పారదర్శకమైన దర్యాప్తు కోసం కేసుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారట.

  దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది.బాల గంగాధర్ తిలక్ పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తుందా ?  చంద్రబాబుపై సీబీఐ విచారణకు అదేశిస్తుందా అనేది రాజకీయంగా  చర్చనీయాంశంగా మారింది.

రాజమౌళి సినిమా హిట్టైతే పాన్ వరల్డ్ స్టార్ గా మహేష్.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తారా?